Loading...
Sourav Ganguly: ప్రధాన స్పిన్నర్ లేకుండా ఎలా గెలుస్తారు?.. టీమిండియాపై గంగూలీ విమర్శలు!
ప్రధాన స్పిన్నర్ లేకుండా ఎలా గెలుస్తారు?.. టీమిండియాపై గంగూలీ విమర్శలు!

Sourav Ganguly: ప్రధాన స్పిన్నర్ లేకుండా ఎలా గెలుస్తారు?.. టీమిండియాపై గంగూలీ విమర్శలు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 23, 2026
04:16 pm

ఈ వార్తాకథనం ఏంటి

న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో భారత బౌలర్లు ప్రత్యర్థి జట్టును ఆలౌట్ చేయలేకపోయారు. దీంతో మ్యాచ్‌ను డ్రాగా ముగించుకోవాల్సి వచ్చింది. పిచ్ నుంచి బౌలర్లకు తగిన సహకారం లభించకపోవడమే ఇందుకు కారణమని టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ సమాధానమిచ్చాడు. అయితే తుది జట్టు ఎంపికపై భారత మాజీ కెప్టెన్ సౌరబ్ గంగూలీ అసంతృప్తి వ్యక్తం చేశాడు. ప్రధాన స్పెషలిస్ట్ స్పిన్నర్ లేకుండా ఎలా బరిలోకి దిగుతారని ప్రశ్నించాడు. ఐదో రోజు పిచ్ మరింత ఫ్లాట్‌గా మారుతుందని, అలాంటి పరిస్థితుల్లో నాణ్యమైన స్పిన్నర్ కీలక పాత్ర పోషిస్తాడని అభిప్రాయపడ్డాడు.

వివరాలు

స్పెషలిస్ట్ స్పిన్నర్ ఏడి?

పరిమిత ఓవర్ల క్రికెట్ సిరీస్‌ల్లో భారత్ అద్భుతంగా ఆడింది. వాటిని కైవసం చేసుకుంది. ఇప్పుడు టెస్టు సిరీస్‌లో బరిలోకి దిగింది.

అయితే ఇక్కడ ఓ విషయం అర్థం చేసుకోవాలి. నాణ్యమైన స్పిన్నర్ లేకుండా టెస్టు మ్యాచ్ గెలవడం చాలా కష్టం.

సమయం గడిచే కొద్దీ పిచ్ ఫ్లాట్‌గా మారుతుంది. వాషింగ్టన్ సుందర్‌ను ఆల్‌రౌండర్‌గా ఆడిస్తున్నారు.

మరి స్పెషలిస్ట్ స్పిన్నర్లు కుల్‌దీప్ యాదవ్, మానవ్ సుతార్ ఎక్కడ?'' అని గంగూలీ తన పోస్టులో ప్రశ్నించాడు.

వివరాలు

ఈ పిచ్ టెస్టు క్రికెట్‌కు సరైంది కాదు: మాజీలు

భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి టెస్టు డ్రాగా ముగియడంతో పిచ్ పరిస్థితులపై పలువురు మాజీ క్రికెటర్లు అసంతృప్తి వ్యక్తం చేశారు.

క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ స్పందిస్తూ.. మ్యాచ్‌లో ఫలితం తేలకపోవడం బాగోలేదు. పిచ్ ఈ విధంగా స్పందిస్తుందని అనుకోలేదని వ్యాఖ్యానించాడు.

న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ స్కాట్ స్టైరిస్ కూడా గావస్కర్ అభిప్రాయంతో ఏకీభవించాడు. నేను కూడా మీ మాటలను అంగీకరిస్తున్నా. టెస్టు క్రికెట్‌కు ఈ పిచ్ సరైంది కాదు. మాకు మంచి పిచ్ కావాలి. బ్యాట్, బంతి మధ్య పోటీ ఉండాలి.

కానీ ఈసారి అలాంటి పోరును చూడలేకపోయాం. ఈ రోజు ఉదయం పిచ్ కాస్త ఫర్వాలేదనిపించినా.. సమయం గడిచే కొద్దీ బౌలర్లకు సహకారం లభించలేదు'' అని స్టైరిస్ పేర్కొన్నాడు.

ADVERTISEMENT