Kane Williamson: ఐసీసీ ప్రపంచ కప్‌లలో కేన్ విలియమ్సన్ సాధించిన రికార్డులివే!
భారత్ వేదికగా అక్టోబర్ 5న జరిగే వన్డే వరల్డ్ కప్ 2023 కోసం న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు నేడు స్క్వాడ్ ను ప్రకటించింది. కేన్ విలియమ్సన్ కెప్టెన్‌గా 15 మందితో కూడిన బృందం పేర్లను వెల్లడించింది. గతేడాది మార్చిలో గాయపడిన కేన్ విలియమ్సన్ దాదాపు ఆరు నెలల పాటు మ్యాచులకు దూరమయ్యాడు. తాజాగా వన్డే ప్రపంచ కప్ కోసం మళ్లీ జట్టులోకి వచ్చాడు. ఇప్పటివరకూ కేన్ విలియమ్సన్ ఐసీసీ ప్రపంచ కప్ లలో ఏ విధంగా రాణించాడంతో తెలుసుకుందాం. విలియమ్సన్ 2011 ప్రపంచ కప్‌లో కేవలం నాలుగు మ్యాచులను ఆడాడు. 107.60 స్ట్రైక్ రేట్‌తో 99 పరుగులు చేశాడు. ఆ సీజన్లో న్యూజిలాండ్ సెమీఫైనల్లోనే ఇంటిముఖం పట్టింది
2019లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ గా నిలిచిన విలియమ్సన్
2015 ఎడిషన్‌లో న్యూజిలాండ్ రన్నరప్‌గా నిలిచినప్పటికీ, విలియమ్సన్ తొమ్మిది మ్యాచుల్లో 33.42 సగటుతో 234 పరుగులు చేశాడు. ఆస్ట్రేలియాతో జరిగిన గ్రూప్-స్టేజ్ గేమ్‌లో 42 బంతుల్లో 45 పరుగులతో చెలరేగాడు. 2019లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ 2019లో విలియమ్సన్ కెప్టెన్‌గా కెప్టెన్ గా వ్యవహరించాడు. ఆ టోర్నీలో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా ఎంపికయ్యాడు. తొమ్మిది ఇన్నింగ్స్‌లలో 82.57 సగటుతో 578 పరుగులు చేసి, న్యూజిలాండ్ ఫైనల్ కు వెళ్లడానికి సాయపడ్డాడు. అతను వెస్టిండీస్ (148), దక్షిణాఫ్రికా (106*) పరుగులతో సెంచరీల మోత మోగించాడు.