Cricket Umpire: క్రికెట్ అంపైర్‌గా అవ్వటం ఎలా? అవసరమైన నైపుణ్యాలు ఏంటి..జీతం ఎంత ఉంటుందో తెలుసా?
మనదేశంలో క్రికెట్‌కి ఎంత ప్రాధాన్యం ఉందొ చెప్పనవసరం లేదు. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు, క్రికెట్ ఆడడానికి , చూడటానికి విశేష ఆసక్తి చూపిస్తుంటారు. క్రికెటర్ కావాలనే కోరికతో చాలామంది యువత కలలు కంటున్నారు. కానీ క్రికెట్‌లో కెరీర్ ఆశిస్తున్న వారికి ప్లేయర్‌గా మాత్రమే కాకుండా, అనేక ఇతర ఆప్షన్లు కూడా ఉన్నాయి.
క్రికెట్‌లో అంపైర్‌గా కెరీర్
మీరు ప్లేయర్‌గా అవకాశాలు పొందకపోతే, క్రికెట్‌లో అంపైర్‌గా స్థిరపడడం ఒక మంచి ఆప్షన్. అంతర్జాతీయ స్థాయిలో అంపైర్ల ఇన్‌కమ్ చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. అయితే,అంపైర్ కావాలంటే,మీరు ఏమి చేయాలి?దీనికి సమాధానం తెలుసుకుందాం. అంపైర్లు ఏం చేస్తారు? క్రికెట్‌లో అంపైర్ల పాత్ర చాలా కీలకం. మ్యాచ్ సక్రమంగా జరిగేలా,ఆటగాళ్లు రూల్స్ పాటిస్తున్నారా అన్నదానిపై నిఘా పెడతారు. మ్యాచ్ సమయంలో అంపైర్లు కీలక నిర్ణయాలు తీసుకుంటారు,వారి నిర్ణయాలు ఫైనల్ అవుతాయి. క్రికెట్‌లో రెండు రకాల అంపైర్లు ఉంటారు. ఆన్-ఫీల్డ్ అంపైర్లు: మ్యాచ్ సమయంలో మైదానంలో ఉండి నిర్ణయాలు తీసుకుంటారు. థర్డ్ అంపైర్: కఠినమైన నిర్ణయాల కోసం వీడియో టెక్నాలజీని ఉపయోగిస్తారు. టీమ్‌లు ఆన్-ఫీల్డ్ అంపైర్ నిర్ణయాలను సవాలు చేస్తే,థర్డ్ అంపైర్ కీలక పాత్ర పోషిస్తాడు.
అంపైర్‌గా కెరీర్ ప్రారంభించడానికి అవసరమైన నైపుణ్యాలు
అడ్వాన్స్‌డ్ టెక్నాలజీతో బాల్‌ను ట్రాక్ చేసి, వీడియోలను పరిశీలించి తుది నిర్ణయం తీసుకుంటాడు. అంపైర్ కావడానికి క్రికెట్ ఆడిన అనుభవం అవసరం లేదు. మీరు క్రికెట్‌ను బాగా అర్థం చేసుకోవాలి. క్రికెట్‌లో క్విక్ డెసిషన్ మేకింగ్, మంచి కమ్యూనికేషన్, ఫిజికల్ ఫిట్‌నెస్ (అంపైర్లు ఎక్కువ గంటలు నిలబడాల్సి వస్తుంది) అవసరమవుతాయి. మ్యాచ్ సమయంలో అన్ని అంశాలను జాగ్రత్తగా పరిశీలించేందుకు కంటి చూపు బాగా ఉండాలి.
అంపైర్‌గా ఎలా అవ్వాలి?
సర్టిఫికేషన్: అంపైర్‌గా పని చేయడానికి సంబంధిత కోర్సులు పూర్తి చేయండి. ప్రాక్టీస్: స్థానిక లీగ్‌లలో అంపైర్‌గా ప్రాక్టీస్ చేయడం ద్వారా అనుభవం పొందండి. నెట్‌వర్కింగ్: ఇతర అంపైర్లతో సంబంధాలు పెంచుకోండి, తద్వారా మీకు అవకాశాలు వస్తాయి. ఇలాంటి విధానాలను అనుసరించడం ద్వారా, మీరు క్రికెట్‌లో అంపైర్‌గా మీ కెరీర్‌ను ప్రారంభించవచ్చు.
భారత్‌లో క్రికెట్ అంపైర్‌గా ఎలా అవ్వాలి?
1. మీ రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్‌లో చేరండి క్రికెట్ అంపైర్‌గా మీ ప్రస్థానం ప్రారంభించడానికి,ముందుగా మీరు మీ రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్‌లో చేరాలి.ఇది అంపైర్‌గా మీ అభివృద్ధి కోసం ప్రాథమిక అడుగు. 2. బీసీసీఐ అంపైర్ అకాడమీలో చేరడం మీఅసోసియేషన్ ద్వారా బీసీసీఐ అంపైర్ అకాడమీలో చేరేందుకు మీకు స్పాన్సర్‌షిప్ అవసరం.ఇది నాణ్యత,ప్రమాణాలను నిర్ధారించేందుకు అత్యంత అవసరం. 3. సర్టిఫికేషన్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించండి బీసీసీఐ అంపైర్ అకాడమీలో సర్టిఫికేషన్ ఎగ్జామ్‌లో మీరు ఉత్తీర్ణత సాధించాలి.ఇది మీ అంపైర్‌గా అభివృద్ధికి కీలకమైన దశ. 4. రాష్ట్ర స్థాయి మ్యాచ్‌లకు పని చేయండి అనుభవం పొందడం కోసం,మీరు రాష్ట్ర స్థాయి క్రికెట్ మ్యాచ్‌లకు పనిచేయాలి.ఈఅనుభవం మీ అంపైరింగ్ నైపుణ్యాలను మెరుగుపరుస్తుంది.
భారత్‌లో క్రికెట్ అంపైర్‌గా ఎలా అవ్వాలి?
5. లెవల్ 1 ఎగ్జామ్‌కి అప్లై చేయండి 2-3 సంవత్సరాల అనుభవం తర్వాత, మీరు లెవల్ 1 ఎగ్జామ్‌కి అప్లై చేసుకోవచ్చు. ఈ పరీక్షలో విజయవంతమైన తర్వాత, మీకు మెడికల్ టెస్టులు క్లియర్ చేయడం అవసరం. 6. ఫైనల్ సర్టిఫికేషన్ పొందండి మీ మెడికల్ టెస్టులు క్లియర్ చేసిన తర్వాత, మీరు ఫైనల్ సర్టిఫికేషన్ పొందుతారు. ఈ సర్టిఫికేషన్‌తో మీరు అధికారికంగా క్రికెట్ అంపైర్‌గా మలుగుతారు. 7. అంతర్జాతీయ అంపైర్‌గా మారండి బీసీసీఐ సిఫారసుతో, మీరు అంతర్జాతీయ అంపైర్‌గా అవకాశం పొందవచ్చు. ఇది మీ క్రికెట్ కెరీర్‌ను మరింత వేగవంతం చేస్తుంది.
అంపైర్ జీతం
అంతర్జాతీయ అంపైర్లు: అంతర్జాతీయ క్రికెట్ అంపైర్లు వారి పనిచేసే మ్యాచ్‌ల సంఖ్య ఆధారంగా సంవత్సరానికి రూ.66 లక్షల నుంచి రూ.1.67 కోట్ల వరకు సంపాదిస్తారు. ఉదాహరణకు, ఒక్కో టెస్ట్ మ్యాచ్‌కు దాదాపు రూ.3.33 లక్షలు, వన్డే మ్యాచ్‌లకు రూ.2.26 లక్షలు, టీ20 మ్యాచ్‌లకు రూ.1.25 లక్షలు సంపాదిస్తారు. డొమెస్టిక్ అంపైర్లు: డొమెస్టిక్ మ్యాచ్‌లలో, బీసీసీఐ అంపైర్లకు వారి గ్రేడ్ ఆధారంగా జీతాలు ఉంటాయి. టాప్-గ్రేడ్ అంపైర్లు రోజుకు దాదాపు రూ.40,000 సంపాదిస్తారు, ఇతరులు రోజుకు దాదాపు రూ.30,000 అందుకుంటారు.