LOADING...
IPL 2026: గుజరాత్‌పై రాయల్ ఛాలెంజర్స్ ఘన విజయం
గుజరాత్‌పై రాయల్ ఛాలెంజర్స్ ఘన విజయం

IPL 2026: గుజరాత్‌పై రాయల్ ఛాలెంజర్స్ ఘన విజయం

వ్రాసిన వారు Moogati Shabari
Apr 24, 2026
11:22 pm

ఈ వార్తాకథనం ఏంటి

బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఐపీఎల్ 2026 భాగంగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 5 వికెట్ల తేడాతో విజయం నమోదు చేసింది. ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 205 పరుగులు సాధించింది. అనంతరం 206 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ జట్టు 18.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది.

వివరాలు

గిల్ దూకుడు ప్రదర్శన..

అనంతరం కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌తో కలిసి ఓపెనింగ్‌కు వచ్చిన సాయి సుదర్శన్ ఆరంభం నుంచే దూకుడు ప్రదర్శించాడు. వీరిద్దరూ కలిసి తొలి పది ఓవర్లలో వికెట్ కోల్పోకుండా 100 పరుగులు పూర్తి చేసి జట్టుకు బలమైన ఆరంభాన్ని అందించారు. ఇన్నింగ్స్ తొమ్మిదో ఓవర్‌లో కృనాల్ పాండ్యా బౌలింగ్‌లో సాయి సుదర్శన్ తన శక్తివంతమైన ఆటను చూపించాడు. ఃదీంతో ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగంగా 2000 పరుగులు చేసిన బ్యాటర్‌గా సుదర్శన్ అగ్రస్థానంలో నిలిచాడు.

వివరాలు

సుదర్శన్ ఖాతా

వీరిద్దరూ కలిసి తొలి పది ఓవర్లలో వికెట్ కోల్పోకుండా 100 పరుగులు పూర్తి చేసి జట్టుకు బలమైన ఆరంభాన్ని అందించారు. ఇన్నింగ్స్ తొమ్మిదో ఓవర్‌లో కృనాల్ పాండ్యా బౌలింగ్‌లో సాయి సుదర్శన్ తన శక్తివంతమైన ఆటను చూపించాడు. ఆ ఓవర్ చివరి బంతికి ముందు 66 పరుగులతో ఉన్న ఆయన, చివరి బంతిని సిక్సర్‌గా మలిచి 2000 పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. ఇంతకుముందు ఈ రికార్డు క్రిస్ గేల్ పేరిట ఉండేది. గేల్ 48 ఇన్నింగ్స్‌ల్లో 2000 పరుగులు పూర్తి చేయగా, సాయి సుదర్శన్ కేవలం 47 ఇన్నింగ్స్‌ల్లోనే ఆ ఘనత సాధించాడు. దీంతో ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగంగా 2000 పరుగులు చేసిన బ్యాటర్‌గా సుదర్శన్ అగ్రస్థానంలో నిలిచాడు.

Advertisement