
Koneru Humpy vs Divya Deshmukh: హంపి vs దివ్య.. మహిళల చెస్ ఫైనల్.. మ్యాచ్ వివరాలు ఇవే!
ఈ వార్తాకథనం ఏంటి
మహిళల చెస్ ప్రపంచకప్ 2025 ఫైనల్ సమయం అసన్నమైంది. ఈసారి టైటిల్ ఎవరికి దక్కినా భారత్‌కే కప్ గ్యారెంటీ. ఎందుకంటే ఫైనల్‌కు అడుగుపెట్టిన వారిద్దరూ భారతీయులే కావడం విశేషం. ఒకవైపు అనుభవజ్ఞురాలు, తెలుగు తేజం కోనేరు హంపీ, మరోవైపు యువ సంచలనం, కేవలం 19 ఏళ్ల వయసులో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటున్న దివ్య దేశ్‌ముఖ్ తలపడనున్నారు.
Details
ఫైనల్ షెడ్యూల్ ఇలా ఉంది
ఈ ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ రెండు రోజులు పాటు క్లాసికల్ ఫార్మాట్‌లో జరగనుంది. మొదటి మ్యాచ్ జూలై 26వ తేదీ సాయంత్రం 4:30 గంటలకు ప్రారంభం అవుతుంది. రెండవ మ్యాచ్ జూలై 27న నిర్వహించనున్నారు. మొదటి 40 మెళకువల (మూవ్స్) కోసం ఒక్కో క్రీడాకారుడికి 90 నిమిషాల సమయం లభిస్తుంది. అనంతరం ఆట ముగిసేవరకు మరో 30 నిమిషాల అదనపు సమయం ఇస్తారు. ప్రతి మెళకువకు 30 సెకన్ల ఇంక్రిమెంట్ టైమ్ కూడా ఉంటుంది. టై సమానత అయితే? రెండు క్లాసికల్ గేమ్స్ కూడా టైగా ముగిస్తే.. జూలై 28న సోమవారం ర్యాపిడ్ టైబ్రేక్ గేమ్స్ ఆడాల్సి ఉంటుంది.
Details
ప్రైజ్ డీటెయిల్స్
విజేతకు ప్రతిష్ఠాత్మక టైటిల్‌తో పాటు రూ. 43 లక్షల నగదు బహుమతి రన్నరప్‌కు రూ. 30 లక్షల ప్రైజ్‌మనీ లభిస్తుంది. లైవ్ ఎక్కడ చూడాలి? ఈ మ్యాచ్‌కు టీవీ ఛానెల్స్ లేదా ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌పై ప్రసారం ఉండదు. అయితే, ఈ హైటెన్షన్ పోరును ఫిడే అధికారిక యూట్యూబ్ ఛానెల్‌లో ప్రత్యక్షంగా వీక్షించవచ్చు. ఈ ఫైనల్ మ్యాచ్‌ను భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా చెస్ ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఒకవైపు అనుభవం, మరోవైపు యువ శక్తి మధ్య జరుగుతున్న పోరు చూడటం ఆసక్తికరంగా మారింది.