Page Loader
Wrestlets Protest : బజరంగ్, సాక్షి మాలిక్, వినేష్‌లకు వ్యతిరేకంగా వందలాది మంది రెజ్లర్ల నిరసన
బజరంగ్, సాక్షి మాలిక్, వినేష్‌లకు వ్యతిరేకంగా వందలాది మంది రెజ్లర్ల నిరసన

Wrestlets Protest : బజరంగ్, సాక్షి మాలిక్, వినేష్‌లకు వ్యతిరేకంగా వందలాది మంది రెజ్లర్ల నిరసన

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 03, 2024
06:13 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారతీయ రెజ్లింగ్‌లో కొనసాగుతున్న సంక్షోభం కొత్త టర్న్ తీసుకుంది. తమ కెరీర్‌లో ఒక కీలకమైన సంవత్సరాన్ని కోల్పోయినందుకు నిరసనగా వందలాది మంది జూనియర్ రెజ్లర్లు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద సమావేశమయ్యారు. అయితే ఈసారి మాత్రం ప్రముఖ రెజ్లర్లు అయిన వినేష్ ఫోగట్, బజరంగ్ పూనియా, సాక్షి మాలిక్‌లకు వ్యతిరేకంగా వారంతా నిరసన తెలిపారు. వారికి వ్యతిరేకంగా నిరసన చేయడంతో రెజ్లింగ్ సంక్షోభం కొత్త మలుపు తిరిగింది. ఇక ఉత్తరప్రదేశ్, హర్యానా, ఢిల్లీలోని వివిధ ప్రాంతాల నుండి జూనియర్ రెజ్లర్లు బస్సులో వచ్చి నిరసనను తెలియజేశారు.

Details

డబ్ల్యూఎఫ్ఐని పునరుద్ధరించాలి

ఇక ఉత్తరప్రదేశ్, హర్యానా, ఢిల్లీలోని వివిధ ప్రాంతాల నుండి జూనియర్ రెజ్లర్లు బస్సులో వచ్చి నిరసనను తెలియజేశారు. ఇందులో చాలామంది వీరేందర్ రెజ్లింగ్ అకాడమీ నుంచి వచ్చినట్లు తెలిసింది. హఠాత్తుగా ఇంతమంది రావడంతో పోలీసులు వారు అదుపు చేయడానికి కష్టపడ్డారు. వీరంతా సాక్షి మాలిక్, బజరంగ్ పూనియా, వినేష్ ఫోగటల్ కు వ్యతిరేకంగా నిరసనలు తెలిపారు. మరోవైపు కేంద్రం సస్పెండ్ చేసిన డబ్ల్యూఎఫ్ఐని పునరుద్ధరించాలని జూనియర్ రెజ్లర్లు కోరారు. ఆ ముగ్గరి వల్ల తమ కెరీర్‌లు ప్రమాదంలో పడ్డాయని, రెజ్లింగ్ సమాఖ్య తమ గురించి కూడా ఆలోచించాలని వారు కోరారు.