హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కు త్వరలోనే ఎన్నికలు!
ఈ వార్తాకథనం ఏంటి
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ)కు త్వరలో ఎన్నికలు జరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. హెచ్‌సీఏ కార్యవర్గం రద్దుతో ప్రస్తుతం సుప్రీంకోర్టు మాజీ జడ్జీ నాగేశ్వర్ రావు పర్యవేక్షణలో హెచ్‌సీఏ కొనసాగుతున్న విషయం తెలిసిందే.
ఉప్పల్ స్టేడియంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో దుర్గాప్రసాద్ పలు కీలక ఆంశాలపై మాట్లాడారు.
వీలైంనత త్వరలో హైదరాబాద్ క్రికెట్ సంఘంకు ఎన్నికలు నిర్వహిస్తామని, ఈ ప్రక్రియను కూడా త్వరగా ముగిస్తామని వెల్లడించారు.
ఎన్నికల ప్రక్రియకు పూర్తి సమాచారం ఈనెల 10లోగా ఇవ్వాలని క్లబ్ కార్యదర్శులకు కోరామని, హెచ్‌సీఏకు పూర్వ వైభవం తీసుకురావడమే తమ లక్ష్యమని చెప్పారు.
Details
ఐపీఎల్ అనంతరం స్టేడియానికి మరమ్మతులు
ఐపీఎల్ మ్యాచ్ ల నిర్వహణతో పాటు స్టేడియంలో మౌలిక వసతులు, ఎన్నికల ప్రక్రియ, ఎక్సలెన్సీ సెంటర్, డార్మెటరీపై గురించి దుర్గా ప్రసాద్ మాట్లాడారు.
ఉప్పల్ వేదికగా ఐపీఎల్ మ్యాచ్ లను విజయవంతంగా నిర్వహిస్తున్నామని, స్టేడియంలోని కార్పొరేట్ బాక్సుల్లో ఏసీలు, టీవీలు చాలా వరకు మరమ్మతులకు గురయ్యాయని వాటిని సరి చేస్తామని వెల్లడించారు.
తెలంగాణ గ్రామీణ ప్రాంతాలకు చెందిన 50 మందికి చొప్పున బాలురు, బాలికలకు ఉప్పల్ స్టేడియంలో ప్రత్యేక వసతితో పాటు శిక్షణిస్తామని, ఐపీఎల్ ముగిసిన అనంతరం ఉత్తర, దక్షిణ స్టాండ్ల పైకప్పు మరమ్మతులు పనులు ప్రారంభిస్తామన్నారు.
అయితే ఈసారి ఫిజికల్ గా మ్యాచ్ టికెట్లు అందించేందుకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తామన్నారు.