Asian Games 2023 : ఆసియా గేమ్స్‌లో రికార్డు సృష్టించిన హైదరాబాద్ అమ్మాయి
ఆసియా గేమ్స్ 2023 పోటీల్లో భారత షూటర్లు అద్భుతంగా రాణిస్తున్నారు. మిగిలిన అథ్లెట్ల నుంచి ఆశించిన స్థాయి పర్ఫామెన్స్ రాకపోయినా షూటింగ్ లో మాత్రం భారత్‌కి పతకాల పంట పండుతోంది. తాజాగా ఆసియా గేమ్స్ లో హైదారాబాదీ షూటర్ ఇషా సింగ్ సంచలనాలను సృష్టిస్తున్నారు. బుధవారం ఒక స్వర్ణం, రజతం సాధించిన ఆమె, ఇవాళ మరో 2 సిల్వర్ మెడల్స్ సాధించింది. దీంతో ఆసియా క్రీడల చరిత్రలో నాలుగు పతకాలు సాధించిన తొలి క్రీడాకారిగా ఆమె రికార్డు నెలకొల్పారు.
ఇషా సింగ్ సాధించిన ఘనతలు ఇవే
25 మీటర్ల పిస్టల్ టీమ్, 25 మీటర్ల పిస్టల్ వ్యక్తిగత, 10 మీటర్ల పిస్టల్ వ్యక్తిగత, 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ టీమ్ విభాగంలో ఇషా సింగ్ పతకాలను సాధించింది. ఇవాళ ఉదయం జరిగిన మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ జట్టు ఈవెంట్‌లో ఇషా సింగ్‌తో పాటు పాలక్, దివ్యతో కూడిన భారత జట్టు రజతం నెగ్గింది. ఇక టెన్నిస్‌లో పురుషుల డబుల్ ఈవెంట్‌లో ఫైనల్ చేరిన సాకేత్ మెనేని, రామ్ కుమార్ రామనాథన్ రజతంతో సరిపెట్టుకున్నారు.