Page Loader
Sunrisers Hyderabad: ఐపీఎల్ చరిత్రనే తిరగరాసిన హైద‌రాబాద్.. అత్య‌ధిక స్కోర్ల జాబితా ఆరంజ్ ఆర్మీదే!
ఐపీఎల్ చరిత్రనే తిరగరాసిన హైద‌రాబాద్.. అత్య‌ధిక స్కోర్ల జాబితా ఆరంజ్ ఆర్మీదే!

Sunrisers Hyderabad: ఐపీఎల్ చరిత్రనే తిరగరాసిన హైద‌రాబాద్.. అత్య‌ధిక స్కోర్ల జాబితా ఆరంజ్ ఆర్మీదే!

వ్రాసిన వారు Jayachandra Akuri
May 25, 2025
11:10 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఐపీఎల్‌లో కొంద‌రు బ్యాట‌ర్‌లు తమ ప‌వ‌ర్‌హిట్టింగ్‌తో నయా రికార్డులు నెల‌కొల్పుతుంటే.. మరికొంద‌రు బౌలింగ్ తుపానులా విరుచుకుపడుతూ ప్రత్యర్థులను కట్టడి చేస్తున్నారు. కానీ, వీరంతా ఒక్కో ఆటగాళ్ల ప్ర‌ద‌ర్శ‌న‌లు కాగా, సన్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ మాత్రం జట్టు అద్భుుతమైన చరిత్రను తిర‌గ‌రాస్తోంది. అదీ కేవ‌లం ఒక్కో మ్యాచ్ లేదా సీజన్‌కే పరిమితం కాకుండా.. స్థిరతతో, ఆత్మవిశ్వాసంతో.. టీ20ల్లో ఎలా ఆడాలో చూపిస్తోంది ఆరెంజ్ ఆర్మీ.

Details

అత్య‌ధిక స్కోర్లు సాధించిన జ‌ట్టుగా రికార్డు 

ఐపీఎల్ 18వ సీజన్ చివరి లీగ్ మ్యాచ్‌లోనూ సన్‌రైజ‌ర్స్ భారీ స్కోరు నమోదు చేయ‌డంతో చ‌రిత్రలో మరో మైలురాయిని చేరింది. ఇప్పటికే ఐపీఎల్ చరిత్రలో అత్యధిక స్కోర్ చేసిన జ‌ట్టుగా ఓ రికార్డు నెల‌కొల్పిన ఈ జట్టు, మ‌రోసారి అదే ఘ‌నతను పునరావృతం చేసింది. అత్యధిక స్కోర్ల జాబితాలో మొదటి నాలుగు స్థానాల్ని కైవసం చేసుకున్న ఏకైక జట్టుగా నిలిచింది. ఆరు టాప్ స్కోర్లను తీసుకుంటే, అందులో ఐదు మ్యాచ్‌ల్లో స్కోర్లు సన్‌రైజ‌ర్స్‌ ఖాతాలోనే ఉండటం విశేషం.

Details

287 పరుగులతో రికార్డు

2016 టైటిల్ విజయం తర్వాత త‌నదైన ఆట తీరుతో ముందుకెళ్తున్న హైద‌రాబాద్, 2024 మినీ వేలంలో ప్యాట్ క‌మిన్స్‌, ట్రావిస్ హెడ్‌లను తీసుకోవ‌డంతో దూకుడు పెంచుకుంది. ప‌దిహేడో సీజన్‌లో చిన్న‌స్వామి స్టేడియంలో ట్రావిస్ హెడ్ - హెన్రిచ్ క్లాసెన్ మెరుపుల‌తో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 287 పరుగులు కొట్టి, ఐపీఎల్ చరిత్రలోనే అత్య‌ధిక స్కోరు సాధించింది. అప్ప‌టివ‌ర‌కూ కోల్‌కతా నైట్ రైడ‌ర్స్ పేరిట ఉన్న రికార్డును తుడిచిపెట్టేసింది.

Details

ఒకే సీజన్ - మూడు భారీ స్కోర్లు 

ఒకే సీజన్‌లో మూడు భారీ స్కోర్లతో సంచ‌ల‌నం సృష్టించింది SRH. ముంబైపై 277, రాజస్థాన్‌పై 286, ఢిల్లీలో మరోసారి క్లాసెన్ శతకంతో 278 ప‌రుగులు. ఇషాన్ కిష‌న్, ట్రావిస్ హెడ్, క్లాసెన్ వంటి ఆటగాళ్ల బ్యాటింగ్ బలంతో ప్రత్యర్థి బౌలర్లను విలవిలలాడించింది క‌మిన్స్ సేన. బౌలింగ్ వైఫ‌ల్యంతో ప్లే ఆఫ్స్‌కు దూరం ఇంత భారీ స్కోర్లు చేసినా.. టైటిల్ ఆశ‌ల్ని నెరవేర్చ‌లేకపోయింది SRH. నిరుడు రన్నరప్‌గా నిలిచిన ఈ జట్టు, ఈసారి బౌలింగ్ విఫ‌ల‌త, కొన్ని కీల‌క మ్యాచ్‌ల్లో బ్యాటింగ్ తడ‌బాటు కారణంగా ప్లే ఆఫ్స్‌కు చేరలేకపోయింది. అయినా.. ఆటతీరు, ప్రేక్షకులకు ఇచ్చిన వినోదంతో మాత్రం అంద‌రి మ‌న‌సుల్లో స్థానం ద‌క్కించుకుంది.