విరాట్ కంటే నేనే బెటర్ : పాకిస్తాన్ ప్లేయర్
వరల్డ్ క్రికెట్లో ఎంతోమంది దిగ్గజ ప్లేయర్లు తమకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును పొందారు. దాదాపుగా రెండు శతాబ్దాల క్రికెట్ ఆటగాళ్లలో డాన్ బ్రాడ్ మన్, వివ్ రిచర్డ్స్, సునీల్ గవాస్కర్, సచిన్, షేన్ వార్న్ లాంటి దిగ్గజాలను ప్రపంచం చూసింది. ప్రస్తుతం ఆ దిశగా విరాట్ కోహ్లీ ప్రయాణిస్తున్నారు. ఎందకంటే అతడు నమోదు చేసిన గణాంకాలను చూస్తేనే కోహ్లీ ప్రతిభ ఎంటో తెలుసుకోవచ్చు. వన్డేలో అత్యధిక సెంచరీలు చేసిన భారత మాజీ బ్యాటర్ సచిన్ టెండూల్కర్ (49) రికార్డును సమం చేయడానికి కోహ్లీ కేవలం మూడు వన్డేల దూరంలో ఉన్నాడు. అలాంటి కోహ్లీ కంటే కూడా తాను మెరుగైన ఆటగాడనంటూ పాకిస్తాన్ ప్లేయర్ ఒకరు సంచలన వ్యాఖ్యలు చేశారు.
విరాట్ కోహ్లీతో పోల్చుకోవడం లేదు
లిస్ట్ ఎ కెరీర్ లో కోహ్లీ కంటే మెరుగ్గా ఆడానని మాజీ పాకిస్తాన్ ప్లేయర్ కుర్రం మంజూర్ తెలిపారు. 2008 అరంగ్రేటం చేసిన మంజూర్.. పాకిస్తాన్ తరుపున 26 అంతర్జాతీయ వన్డేలు, 16 టెస్టులు, ఏడు వన్డేలు, మూడు టీ20లు ఆడాడు. తాను విరాట్ కోహ్లీతో పోల్చుకోవడం లేదని, 50 ఓవర్ల క్రికెట్లో టాప్-10లో ఎవరు ఉన్నా తానే ప్రపంచ నెంబర్ వన్ అని మంజూర్ వెల్లడించారు. తన తర్వాతే కోహ్లీ ఉన్నాడని, లిస్ట్ ఏ క్రికెట్లో అతడికంటే మెరుగైన రికార్డులు తనకు ఉన్నాయని చెప్పారు. కోహ్లీ ప్రతి ఆరు ఇన్నింగ్స్‌కు ఓ సెంచరీ చేశాడని, తాను ప్రతి 5.68 ఇన్నింగ్స్‌కే ఓ శతకం నమోదు చేశానని మంజూర్ గుర్తు చేశారు.