Page Loader
MS Dhoni: నాకు లస్సీ అంటే ఇష్టం లేదు.. వదంతులపై ఎంఎస్ ధోని క్లారిటీ!
నాకు లస్సీ ఇష్టం లేదు.. వదంతులపై ఎంఎస్ ధోని క్లారిటీ!

MS Dhoni: నాకు లస్సీ అంటే ఇష్టం లేదు.. వదంతులపై ఎంఎస్ ధోని క్లారిటీ!

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 23, 2025
11:14 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత మాజీ క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ ఎంఎస్ ధోని (MS Dhoni) తన జీవితంలో ఎదురైన అత్యంత హాస్యాస్పదమైన వదంతి గురించి ఇటీవల ఓ కార్యక్రమంలో ముచ్చటించారు. అంతర్జాతీయ క్రికెట్‌లోకి తొలిసారిగా అడుగుపెట్టిన రోజుల్లో, ధోని బంతిని శక్తివంతంగా బాదుతున్న తీరు చూసి ఆయన ఆహారపు అలవాట్లు పెద్ద చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో, మీ జీవితంలో వచ్చిన అతి హాస్యాస్పద వదంతి ఏది? అని అడిగిన ప్రశ్నకు ధోని చమత్కారంగా స్పందించాడు. 'నేను రోజూ 5 లీటర్ల పాలు తాగుతాను అని వినడం అని నవ్వుతూ సమాధానమిచ్చాడు.

Details

ఎవరైనా ఐదు లీటర్లు పాలు తాగుతారా

'నిజానికి నేను ఒక లీటరు పాలు తాగుతానేమో కానీ, మిగతా నాలుగు లీటర్లు తాగడం అబద్ధమే. అన్ని పాలు తాగడం ఎవరికైనా సాధ్యమా? అని ధోని అన్నారు. అంతేకాదు, తాను వాషింగ్‌ మెషీన్‌లో లస్సీ తయారు చేసి తాగుతానన్న వదంతిపై కూడా ధోని స్పందించాడు. 'నేను అసలు లస్సీ తాగను. అది పూర్తిగా వదంతే అంటూ స్పష్టం చేశాడు. ధోని స్పందనపై అక్కడున్న వారందరూ నవ్వులు చిందించారు.