
ఆ సెంచరీ కోసం రెండేళ్లుగా ఏడ్చానా అనిపించింది : విరాట్ కోహ్లీ
ఈ వార్తాకథనం ఏంటి
భారత మాజీ కెప్టెన్, రన్ మెషీన్ విరాట్ కోహ్లీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కోహ్లీ 70 సెంచరీల దగ్గర ఆగిపోయి దాదాపు రెండున్నరేళ్ల తర్వాత 71వ సెంచరీ చేసిన విషయం తెలిసిందే.
గతేడాది ఆసియా కప్ లో ఆఫ్ఘనిస్తాన్ పై విరాట్ కోహ్లీ 71వ సెంచరీని నమోదు చేశాడు.
అయితే ఈ సెంచరీ చేసే ముందు తనకు ఎదురైన అనుభవాలపై ప్యూమా షో లెట్ దేర్ బి స్పోర్ట్ లో కోహ్లీ ప్రసంగించాడు.
ఈ సెంచరీ చేయడానికి రెండేళ్లు ఏడ్చానని తన మనసులోని మాటను బయటపెట్టాడు. అయితే టీ20 ల్లో సెంచరీ చేస్తానని తాను ఏ మాత్రం అనుకోలేదన్నాడు. 71 సెంచరీ తర్వాత మరో నాలుగు సెంచరీలను కోహ్లీ బాదాడు.
Details
75 సెంచరీలు సాధించిన విరాట్ కోహ్లీ
తాను సెంచరీ చేయడానికి ముందు 94 పరుగులు చేశానని, ఈసారి సెంచరీ సాధిస్తానని గట్టి నమ్మకం రావడంతో తర్వాత బంతికే సిక్సర్ కొట్టానని, ఆ సెంచరీ సాధించిన వెంటనే గట్టిగా నవ్వి, రెండేళ్ల నుంచి దీని కోసం ఏడ్చానా అని అనిపించిందని కోహ్లీ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
ఆ సెంచరీ సాధించినప్పుడు నిజంగానే ఏడ్చారా అని ఒకరు ప్రశ్నించగా.. అప్పుడు కాదు కాని అనుష్క మాట్లాడినప్పుడు నిజంగానే కళ్లలో నిళ్లు తిరిగాయని వెల్లడించారు.
ఇక వన్డేలో సచిన్ సాధించిన 49 సెంచరీని బ్రేక్ చేస్తే అది తనకు ఓ ఎమోషనల్ మూమెంట్ అవుతుందని వివరించారు. వన్డేల్లో కోహ్లీ 46 సెంచరీలు బాదగా.. మొత్తంగా మీద 75 సెంచరీలు చేశాడు