వావ్ సూపర్ ఇన్నింగ్స్.. నేను చూసిన బెస్ట్ బ్యాటింగ్ ఇదే : విరాట్ కోహ్లీ
ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా గురువారం కేకేఆర్ తో జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ యశస్వీ జైస్వాల్ పరుగుల సునామీని సృష్టించాడు. కేవలం 13 బంతుల్లోనే జైస్వాల్ హాఫ్ సెంచరీని సాధించాడు. తద్వారా ఐపీఎల్ చరిత్రలోనే ఫాస్టెస్ట్ ఫీప్టి చేసిన ఆటగాడిగా జైస్వాల్ చరిత్రకెక్కాడు. ఈ మ్యాచ్ లో 47 బంతుల్లో 13 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 98 పరుగులు చేశాడు. ఈ సంచలన ఇన్నింగ్స్ చూసిన చాలామంది మాజీ క్రికెటర్లు జైస్వాల్ ను పొగడ్తల వర్షంతో ముంచెత్తారు. తాజాగా ఈ జాబితాలోకి టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ కూడా చేరిపోయాడు.
జైస్వాల్ కు ప్రశంసల వెల్లువ
వావ్ ఈ మధ్య కాలంలో తాను చూసి బెస్ట్ బ్యాటింగ్ లలో ఇదీ ఒకటి అని, యశస్వీ కి అద్భుతమైన టాలెంట్ ఉందని విరాట్ కోహ్లీ కొనియాడారు. మరోవైపు ఆస్ట్రేలియా దిగ్గజం బ్రెట్ లీ కూడా జైస్వాల్ ని ప్రశంసించాడు. జైస్వాల్ అద్భుత ఆటగాడు అని, అతన్ని బీసీసీఐ జాతీయ జట్టులోకి తీసుకోవాలని బ్రెట్ లీ చెప్పుకొచ్చాడు. ఇక సూర్యకుమార్ కూడా జైస్వాల్‌ని ప్రశంశిస్తూ ఓ ట్విట్ చేశారు. స్పేషల్ ఇన్నింగ్, స్పేషల్ ప్లేయర్, హ్యాట్సాప్ అని సూర్య పేర్కొన్నారు. మ్యాచ్ అనంతరం జైస్వాల్ మాట్లాడుతూ తానెప్పుడూ ఇలాగే ఆడాలని, నెట్ రన్ రేట్ గురించి తాను, సంజు ఆలోచించామని, మ్యాచ్ను సాధ్యమైనంత త్వరగా ముగించేందుకు భారీ షాట్లు ఆడామని జైస్వాల్ తెలిపారు.