KKR vs RR : చితకొట్టిన యశస్వీ జైస్వాల్.. రాజస్థాన్ గ్రాండ్ విక్టరీ
కోల్ కత్తా ఈడెన్ గార్డన్ లో రాజస్థాన్ ఓపెనర్ యశస్వీ జైస్వాల్ పరుగుల సునామీని సృష్టించాడు. అదిరిపోయే ఇన్నింగ్స్ తో సంచలన రికార్డును నమోదు చేశాడు. కేవలం 13 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసి ఐపీఎల్ చరిత్రను తిరిగరాశాడు. దీంతో కోల్ కతా నైటరైడర్స్ విధించిన 149 పరుగుల లక్ష్యాన్ని 13.1 ఓవర్లలో చేధించి రాజస్థాన్ భారీ విజయాన్ని అందుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన కోల్ కతా బ్యాటర్లలో వెంకటేష్ అయ్యర్ 57, నితీష్ రాణా 22, గుర్బాజ్ 18 పరుగులు చెయ్యగా మిగతా బ్యాటర్లు విఫలం కావడంతో రాజస్థాన్ స్వల్ప స్కోరుకే చాప చుట్టేసింది. రాజస్థాన్ బౌలర్లలో యుజేంద్ర చాహల్ 4 వికెట్ల తో విజృంభించాడు.
98 పరుగులు చేసిన యశస్వీ జైస్వాల్
మొదట బ్యాటింగ్ దిగిన రాజస్థాన్ తొలి ఓవర్లలోనే జైస్వాల్ చెలరేగిపోయాడు. నితీష్ రాణా బౌలింగ్ లో వరుసగా 6,6,4,4,2,4 బౌండరీలు బాది ఏకంగా 26 రన్స్ చేశాడు. తర్వాత 13 బంతుల్లోనే హాఫ్ సెంచరీని మార్కును అందుకొని రికార్డు సృష్టించాడు. 47 బంతుల్లో 13 ఫోర్లు, 5 సిక్సర్లు బాది 98 రన్స్ చేశాడు. చివరి వరకూ క్రీజులో ఉండి రాజస్థాన్ కు విజయాన్ని అందించాడు. జైస్వాల్ కి తోడు కెప్టెన్ సంజుశాంసన్ 48 పరుగులతో కోల్ కతా బౌలర్లకు చుక్కలు చూపించాడు. దీంతో రాజస్థాన్ 13.1 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 151 పరుగులు చేసిప్లే ఆఫ్స్ కి చేరువైంది.