KKR vs RR : కోల్ కతా బ్యాటర్లకు దడ పుట్టించిన చాహల్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా 57వ మ్యాచ్ లో కేకేఆర్, రాజస్థాన్ రాయల్స్ తలపడ్డాయి. ఈడెన్ గార్డన్ మైదానంలో మొదట రాజస్థాన్ కెప్టెన్ సంజుశాంసన్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. బ్యాటింగ్ దిగిన కేకేఆర్ రెండో మూడో ఓవర్లో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. బౌల్ట్ బౌలింగ్ లో జోసన్ రాయ్(0) డకౌట్ తో వెనుతిరిగాడు. తర్వాత ధాటిగా ఆడుతున్న రహ్మనుల్లా గుర్బాబ్ (18) ను బౌల్ట్ ఔట్ చేశాడు. వెంకటేష్ అయ్యర్, నితీష్ రాణా ఇన్నింగ్స్ ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. నితీష్ రాణా 22(17) పరుగులతో ఫర్వాలేదనిపించాడు. వెంకటేష్ అయ్యర్ 57(42) పరుగులతో చెలరేగారు. దీంతో కోల్ కతా నైట్ రైడర్స్ గౌరవప్రదమైన స్కోరును చేయగలిగింది.
ఐపీఎల్ లో చరిత్ర సృష్టించిన చాహల్
ఐపీఎల్ చరిత్రలో యుజేంద్ర చాహల్ సంచలన రికార్డును నమోదు చేశాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా నిలిచాడు. వెంకటేష్ అయ్యర్ ఔట్ ను చాహల్(187) ఈ మైలురాయిని సాధించాడు. ఈ మ్యాచ్ లో నాలుగు వికెట్లు పడగొట్టి కోల్ కతా బ్యాటర్ల నడ్డి విరిచాడు.కోల్ కతా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. రాజస్థాన్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్ 2, సందీప్ శర్మ, ఆసీఫ్ తలా ఓ వికెట్ తో రాణించారు.