IPL 2023: కోల్‌కతా, రాజస్థాన్ మధ్య బిగ్ ఫైట్.. గెలిస్తేనే ఫ్లేఆఫ్‌కు!
ఈ వార్తాకథనం ఏంటి
ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా 56వ మ్యాచ్ లో కోల్‌కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్ కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో జరగనుంది.
ఫ్లేఆఫ్స్ లో చోటు దక్కించుకోవాలంటే ఈ మ్యాచ్ లో రెండు జట్లు గెలిచి తీరాల్సిన పరిస్థితి. రెండు జట్లు గెలవడం సాధ్యం కాదు కాబట్టి.. గెలిచిన జట్టు ఫ్లేఆఫ్ కు మరింత దగ్గరవుతుంది. ఓడిన జట్టు దాదాపు ఇంటి ముఖం పట్టినట్లే.. ఈ సీజన్లో ఈ రెండు జట్లు చెరో 11 మ్యాచ్ లు ఆడాయి.
ఇరు జట్లు ఐదు మ్యాచ్ ల్లో నెగ్గగా.. రాజస్థాన్ ఐదో స్థానంలో, కోల్ కతా ఆరో స్థానంలో నిలిచాయి.
Details
నేటి మ్యాచ్ లో గెలుపు ఎవరిదో?
నేటి మ్యాచ్ తో కలిపి ఇరు జట్లు ఇంకా మూడు మ్యాచ్ లు ఆడతాయి. వీటిన్నింటిల్లోనూ నెగ్గితేనే ఫ్లేఆఫ్ కు చేరే అవకాశాలు ఉంటాయి. ఐపీఎల్ లో ఈ రెండు జట్లు ఇప్పటివరకూ 27సార్లు తలపడగా.. అందులో కోల్ కతా 14 విజయాలను సాధించగా.. రాజస్థాన్ 12 మ్యాచ్ ల్లో నెగ్గింది.
రాజస్థాన్: జోస్ బట్లర్, యశస్వి జైస్వాల్, సంజు శాంసన్ (c&wk), పడిక్కల్, హెట్మెయర్, జురెల్, హోల్డర్, ఆడమ్ జంపా/ట్రెంట్ బౌల్ట్, రవిచంద్రన్ అశ్విన్, యుజ్వేంద్ర చాహల్, సందీప్ శర్మ
కోల్‌కత్తా: జాసన్ రాయ్, రహ్మానుల్లా గుర్బాజ్ (wk), వెంకటేష్ అయ్యర్, నితీష్ రాణా (c), రస్సెల్, రింకుసింగ్, నరైన్, శార్దూల్ ఠాకూర్, వైభవ్ అరోరా, హర్షిత్ రానా, వరుణ్ చక్రవర్తి.