
Babar Azam : కెప్టెన్సీ గురించి నాకెలాంటి ఆందోళన లేదు : బాబార్ ఆజామ్
ఈ వార్తాకథనం ఏంటి
భారత్ వేదికగా జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో పాకిస్థాన్ దారుణ ప్రదర్శనతో నిరాశపరుస్తోంది.
వరుసగా మూడు మ్యాచుల్లోనూ ఓడిపోయి సెమీస్ అవకాశాలను పాకిస్థాన్ సంక్లిష్టం చేసుకుంది.
ఇక జరిగే అన్ని మ్యాచుల్లోనూ పాకిస్థాన్ విజయం సాధిస్తేనే సెమీస్ రేసులో నిలుస్తుంది.
శుక్రవారం చెన్నై వేదికగా దక్షిణాఫ్రికాతో తలపడేందుకు పాక్ సిద్ధమవుతోంది.
ఈ క్రమంలో పాకిస్థాన్ కెప్టెన్ బాబార్ అజామ్ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందులో ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు బాబార్ అసక్తికర విషయాలను వెల్లడించారు.
కెప్టెన్సీ వల్లే బ్యాటింగ్‌లో సరైన ప్రదర్శన ఇవ్వలేకపోతున్నాడనే విమర్శలను బాబార్ కొట్టిపడేశాడు.
Details
పొరపాట్లను సరిచేసుకొని బరిలోకి దిగుతాం
క్రికెట్‌లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదని, తాము అత్యుత్తమ క్రికెట్ ఆడేందుకు మాత్రమే ప్రయత్నిస్తామని, తప్పకుండా తాము అన్ని మ్యాచుల్లోనూ గెలవడానికి కృషి చేస్తామని బాబార్ అజామ్ చెప్పాడు.
గత పొరపాట్లను సరిచేసుకొని ఈసారి బరిలోకి దిగుతామని, ఇక కెప్టెన్సీ గురించి తనకు ఎలాంటి ఆందోళన లేదని, ఫీల్డింగ్ చేసే సమయంలోనే తాను కెప్టెన్సీ గురించి ఆలోచిస్తానని పేర్కొన్నాడు.
ఇక బ్యాటింగ్ చేసే సమయంలో బ్యాటర్‌గా మాత్రమే ఆలోచిస్తానని, జట్టు కోసం ఎలా బ్యాటింగ్ చేయాలి, ఎలా పరుగులు రాబట్టాలి అనే విషయాలపై మాత్రమే తాను ఆలోచిస్తానని వివరించారు.