
Rohit Sharma : నేను బ్యాడ్ కెప్టెన్ అవుతానని నాకు తెలుసు : రోహిత్ శర్మ
ఈ వార్తాకథనం ఏంటి
వన్డే వరల్డ్ కప్ 2023లో భారత క్రికెట్ జట్టు అత్యుత్తమంగా రాణిస్తోంది. రోహిత్ శర్మ నేతృత్వంలో ఆ జట్టు వరుసగా ఆరు విజయాలను సాధించింది.
ఇవాళ జరిగే మ్యాచులో శ్రీలంకపై భారత్ విజయం సాధిస్తే సెమీ-ఫైనల్‌కు చేరుకోవడం గ్యారెంటీ.
భారత్ చివరిసారిగా 2011లో వన్డే క్రికెట్ ప్రపంచకప్‌ను గెలుచుకుంది. ఈ సారి వన్డే వరల్డ్ కప్ ట్రోఫీని గెలుచుకోవాలని రోహిత్ శర్మ నేతృత్వంలోని జట్టు భారీ ఆశలు పెట్టుకుంది.
శ్రీలంకతో మ్యాచుకు ముందు రోహిత్ శర్మ కెప్టెన్సీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
మైదానంలో నిర్ధిష్ట ప్రణాళికలతో జట్టును ముందుండి నడిపించాలని, ఎలాంటి పరిస్థితి ఎదురైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు జట్టుకు మేలు జరుగుతుందన్నారు.
Details
ప్రత్యర్థుల బలాన్ని ముందుగానే అంచనా వేయాలి
ప్రత్యర్థుల బలాన్ని ముందుగానే అంచనా వేయాలని, కొన్ని సార్లు మనం అనుకున్నది జరగొచ్చు, జరగకపోవచ్చు అని రోహిత్ శర్మ వెల్లడించారు.
వికెట్ల తీయడానికి ఒక్కొసారి భిన్నమైన ప్లేసుల్లో ఫీల్డర్ ను ఏర్పాటు చేయాలని, జట్టులోని కుర్రాళ్లు అంచనాలకు మించి రాణిస్తున్నారని చెప్పారు.
తనకు ఆట గురించి బాగా తెలుసు అని, ఒక్కొసారి అనుకున్నది జరిగనప్పుడు తాను అకస్మాత్తుగా బ్యాడ్ కెప్టెన్ అవుతానని, ఇలాంటి పరిస్థితుల్లో బాగా రాణించడానికి ప్రయత్నించాలని హిట్ మ్యాన్ పేర్కొన్నాడు.