
Gautam Gambhir: నా జీవితాంతం ఆ టెస్టు సిరీస్ ఓటమిని మర్చిపోలేను : గౌతమ్ గంభీర్
ఈ వార్తాకథనం ఏంటి
టీమిండియా హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్ సక్సెస్‌ఫుల్‌గా ఉన్నారని చెప్పొచ్చు. గంభీర్ హెడ్ కోచ్‌గా నియమితుడైన తర్వాత భారత జట్టు చాంపియన్స్ ట్రోఫీ 2025, ఆసియా కప్ 2025ను గెలిచింది. అలాగే యువ ఆటగాళ్లతో కూడిన జట్టుతో ఇంగ్లాండ్ గడ్డపై ఐదు టెస్టుల సిరీస్‌ను డ్రా చేసింది. అయితే కోచ్‌గా కొత్తగా వచ్చిన మొదటి సిరీస్‌లలో గంభీర్ కొన్ని పరాజయాలను ఎదుర్కొన్నాడు. ముఖ్యంగా భారత గడ్డపై న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌ను ఓడిపోవడం గంభీర్‌కు ప్రత్యేకంగా ముద్ర వేసింది. ఈ సిరీస్ ఫలితంపై ఆయన తాజాగా తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచాడు. గంభీర్ తన జీవితాంతం న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌లో వచ్చిన ఓటమిని మర్చిపోలేనని చెప్పాడు.
Details
ఆటలో గెలుపు ఓటములు సహజం
వెస్టిండీస్‌తో రెండో టెస్టు సందర్భంగా దిల్లీలో కామెంటేటర్ ఆకాశ్ చోప్రాతో గంభీర్ మాట్లాడారు. స్వదేశంలో న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్ ఓటమిని నా జీవితాంతం మర్చిపోలేను. ఇదే విషయం భారత జట్టు కుర్రాళ్లకూ చెప్పాను. ఆ ఓటమిని వదిలేసి ముందుకు సాగాలి. కానీ గతాన్ని మర్చిపోకూడదు. గతాన్ని మర్చిపోతే ఏదైనా తేలికగా తీసుకోవచ్చు. ఆటలో గెలుపు, ఓటమి సహజం. నేను డ్రెస్సింగ్ రూమ్‌లో భారత ఆటగాళ్లకు న్యూజిలాండ్ టెస్టు సిరీస్‌లో ఏం జరిగిందో వివరిస్తుంటా. ప్రత్యర్థికి ఎప్పటికీ అవకాశం ఇవ్వకూడదని గంభీర్ చెప్పారు.
Details
స్వదేశాల్లోనే కాదు విదేశాల్లోనూ గెలవాలి
గంభీర్ ప్రస్తావించిన మరో కీలక అంశం విదేశాల్లో విజయాల అవసరమని ఆయన పేర్కొన్నారు. 'ప్రపంచంలోనే నంబర్ 1 జట్టుగా మారాలంటే స్వదేశంలో గెలిస్తే చాలదు. విదేశాల్లోనూ విజయాలు సాధించాలి. ప్రస్తుతం ఉన్న యువ జట్టు అదే చేస్తున్నారు. ఇంగ్లాండ్ అత్యంత కఠినమైన సవాల్ విసిరే జట్టు, ప్రత్యేకంగా వారి గడ్డపై. అనుభవం తక్కువ ఉన్న జట్టుతో వెళ్లాం, కానీ మన ప్లేయర్స్ అద్భుతంగా ప్రదర్శించారు. ఫలితం మాత్రమే కాకుండా, మనం ఎలాంటి పోరాటం చేశామనే అంశం కీలకం. డబ్ల్యూసీ ఫైనల్‌కు చేరాలంటే స్వదేశంలో గెలిస్తే చాలు కాదు. కేవలం మన దగ్గరే విజయాలు సాధిస్తే ఛాంపియన్‌షిప్ విజేతగా నిలవలేమని గంభీర్ చెప్పుకొచ్చాడు.