Page Loader
Natasa Stankovic: 'సెర్బియాకు వెళ్లను, అగస్త్య కోసం ఇక్కడే ఉంటా'.. హార్దిక్ విడాకులపై నటాషా స్పందన
'సెర్బియాకు వెళ్లను, అగస్త్య కోసం ఇక్కడే ఉంటా'.. హార్దిక్ విడాకులపై నటాషా స్పందన

Natasa Stankovic: 'సెర్బియాకు వెళ్లను, అగస్త్య కోసం ఇక్కడే ఉంటా'.. హార్దిక్ విడాకులపై నటాషా స్పందన

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 09, 2024
01:27 pm

ఈ వార్తాకథనం ఏంటి

టీమిండియా క్రికెటర్ హర్థిక్ పాండ్యాతో విడాకుల ప్రకటన తర్వాత సెర్బియన్ నటి నటాషా స్టాంకోవిచ్ మరోసారి వార్తల్లో నిలిచింది. భారత్‌ను వదిలి సెర్బియాకు వెళ్లిపోయినట్లు వచ్చిన వార్తలను నటాషా ఖండించింది. తన కుమారుడు అగస్త్య ఇక్కడే స్కూల్‌కు వెళ్తున్నారని, అలాంటి సమయంలో సెర్బియాకు వెళ్లడం అసాధ్యమని నటాషా స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో సెర్బియాకు వెళ్లిపోయినట్లు పుకార్లు వచ్చాయని, వాస్తవానికి తన కుమారుడు ఇక్కడ స్కూల్‌లో చేరారని పేర్కొంది.

Details

తల్లిదండ్రులుగా ఆ విషయాన్ని మర్చిపోలేదు

హార్దిక్‌తో విడిపోయినా, తమ కుమారుడు అగస్త్యతో తాము కుటుంబం లాగనే ఉన్నామని, తల్లిదండ్రులుగా ఆ విషయాన్ని మరచిపోలేదని పేర్కొన్నారు. తాను సెర్బియాకు ప్రతేడాదికి వెళ్తుంటానని, కానీ ఇక్కడే ఉండి తన బాధ్యతలను నిర్వహిస్తానని నటాషా వివరించింది. సింగిల్ పేరెంట్‌గా జీవిస్తూ ఎప్పటికీ నేర్చుకుంటూనే ఉన్నానని, అగస్త్యకు తల్లిగా, అతడిని సంతోషంగా ఉంచేందుకు తన వంతు ప్రయత్నం చేస్తూనే ఉంటానని పేర్కొన్నారు. తన కుమారుడికి మరింత సమయాన్ని కేటాయిస్తానని నటాషా అన్నారు.