LOADING...
Wasim Akram: భారత్-పాక్ మ్యాచ్ జరిగితే చూడాలని ఉంది : వసీమ్ అక్రమ్
భారత్-పాక్ మ్యాచ్ జరిగితే చూడాలని ఉంది : వసీమ్ అక్రమ్

Wasim Akram: భారత్-పాక్ మ్యాచ్ జరిగితే చూడాలని ఉంది : వసీమ్ అక్రమ్

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 25, 2025
04:36 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రతిష్ఠాత్మక ఆసియా కప్‌ 2025 సెప్టెంబర్‌ 9న ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఆగస్టు 19న బీసీసీఐ 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును ప్రకటించింది. టీమిండియా మొదటి మ్యాచ్‌ను సెప్టెంబర్‌ 10న యూఏఈతో ఆడనుంది. సెప్టెంబర్‌ 14న భారత్‌-పాకిస్థాన్‌ మ్యాచ్‌ జరగనుంది. ఇరు దేశాల మధ్య ఉన్న ఉద్రిక్తతల కారణంగా ఈ మ్యాచ్‌ సానుకూలంగా ఎక్కువ ప్రాధాన్యం సంతరించింది. అయితే, పాకిస్థాన్‌ మాజీ క్రికెటర్‌ వసీమ్‌ అక్రమ్‌ భారత్‌, పాక్‌ మ్యాచ్‌లు కూడా జరిగితే చూడాలని ఆసక్తి వ్యక్తం చేశారు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్‌, పాకిస్థాన్‌ సంబంధాలు బాగాలేదు.

Details

ఒత్తిడిని అధిగమిస్తే విజయం సాధించగలదు

2013 నుండి ఈ ఇరు దేశాలు ద్వైపాక్షిక సిరీస్‌ల్లో పోట్లేదు. కేవలం వరల్డ్‌ కప్‌, ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీ, ఆసియా కప్‌లాంటి టోర్నమెంట్లలో తటస్థ వేదికలపై మాత్రమే ఈ జట్లు ఎదుర్కొంటున్నాయి. వసీమ్‌ అక్రమ్‌ మాట్లాడుతూ, "ఆసియా కప్ ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్‌కు పండుగ. భారత జట్టు అద్భుత ఫామ్‌లో ఉంది. ఆసియా కప్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగుతుంది. ఒత్తిడిని అధిగమిస్తే విజయం సాధించగలదు. భారత్‌, పాక్‌ మ్యాచ్‌లు కూడా వినోదాత్మకంగా ఉంటాయి. ఆటగాళ్లు, అభిమానులు క్రమశిక్షణ పాటిస్తారని, హద్దులు దాటరని ఆశిస్తున్నానని అన్నారు. వీటితో ఆసియా కప్‌లో భారత్‌, పాక్‌ మ్యాచ్‌లు క్రీడారంగంలో చారిత్రక సందర్భంగా మారే అవకాశం ఉందని వసీమ్‌ ఆక్రమ్‌ అన్నారు.