ఐసీసీ టీ20 జట్టులో సూర్య, కోహ్లీ, పాండ్య
2022 ఏడాదికి గానూ పురుషుల టీ20 జట్టును ఐసీసీ ప్రకటించింది. ఇందులో టీమిండియా నుంచి ముగ్గురు ఆటగాళ్లకి అవకాశం లభించింది. ఇండియా నుంచి విరాట్‌కోహ్లీ, సూర్యకుమార్, ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యాకు చోటిచ్చారు. ఇంగ్లాండ్‌ను టీ20 ప్రపంచ కప్ విజేతగా నిలిపిన జోస్ బట్లర్‌ను కెప్టెన్‌గా నియమించింది. బట్లర్ ఈ ఏడాది అత్యుత్తమ ప్రదర్శనతో అకట్టుకున్నాడు. 45.27 సగటుతో 996 పరుగులు చేశాడు. రన్ మెషిన్ విరాట్ కోహ్లీ టీ20 ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. 27 మ్యాచ్‌ల్లో 1,141 పరుగులు చేశాడు. అగ్రస్థానంలో ఉన్న శ్రీలంక ఆటగాడు మహేలజయవర్ధనే (1,016)ను రికార్డును బద్దలు కొట్టాడు. టీ20ల్లో 4వేల పరుగులు చేసిన తొలి ఆటగాడిగా కోహ్లీ నిలిచాడు.
ఐసీసీ టీ20 పురుషుల జట్టు ఇదే..
సూర్యకుమార్ యాదవ్ ఈ ఏడాది టీ20ల్లో 1000 పరుగులు చేసిన ఏకైక బ్యాటర్‌గా నిలిచారు. రోహిత్ (2018) తర్వాత ఒక క్యాలెండర్ ఇయర్‌లో రెండు టీ20 సెంచరీలు సాధించిన ఆటగాడిగా చరిత్రకెక్కాడు. న్యూజిలాండ్‌కు చెందిన గ్లెన్ ఫిలిప్స్ 21 మ్యాచ్‌లు ఆడి, 44.75 సగటుతో 716 పరుగులు చేశాడు. టీ20 ప్రపంచకప్‌లో శ్రీలంకపై ఫిలిప్స్ 64 బంతుల్లో 104 పరుగులు చేశాడు. ఆల్ రౌండర్ల జాబితాలో హార్ధిక్ పాండ్యాకు అవకాశం లభించింది. టీమిండియా తరపున 607 పరుగులు చేసి, 20 వికెట్లు తీశాడు. జోస్ బట్లర్ (కెప్టెన్,వికెట్ కీపర్), మహ్మద్‌రిజ్వాన్, విరాట్‌కోహ్లీ, సూర్యకుమార్‌యాదవ్, గ్లెన్ ఫిలిప్స్, సికందర్‌రజా, హార్దిక్ పాండ్యా, సామ్ కర్రాన్, వనిందు హసరంగా, హారిస్‌రౌఫ్, జాషువా లిటిల్