ICC New Rule: క్రికెట్‌లో కొత్త రూల్ తీసుకొచ్చిన ఐసీసీ.. ఇక బ్యాటర్లకు పండగే
క్రికెట్‌లో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) కొత్త నిబంధనలను అమలు చేసింది. స్టంప్ ఔట్ అప్పీల్ విషయంలో కొత్త రూల్ తీసుకొచ్చింది. ఫీల్డ్ అంపైర్ నుంచి అప్పీల్ వస్తే కేవలం స్టంప్ ఔట్‌ను మాత్రమే చెక్ చేయాలని నిబంధనలను మార్చింది. ఈ నిర్ణయం గతేడాది డిసెంబర్ 12 నుంచి అమల్లోకి వచ్చినట్లు ఐసీసీ(ICC) స్పష్టం చేసింది. ఐసీసీ తాజా నిర్ణయంతో బ్యాటర్లకు ప్రయోజనం చేకూరనుంది. డీఆర్ఎస్ మిస్ యూజ్ చేసే అవకాశం లేకుండా ఈ మార్పులు చేసినట్లు వెల్లడించింది.
ఇకపై స్టంపింగ్‌ను మాత్రమే చెక్ చేయనున్న థర్డ్ అంపైర్
కీపర్ స్టంప్ ఔట్ కు అప్పీల్ చేసినప్పుడు ఫీల్డ్ అంపైర్లు థర్డ్ అంపైర్ ను నిర్ణయాన్ని వెల్లడించమని కోరుతాడు. అయితే ఈ అప్పీల్ ను పరిశీలించే క్రమంలో ముందుగా థర్డ్ అంపైర్ బంతి బ్యాటును తాకిందా లేదా అనేది రివ్యూలో చూస్తాడు. ఒకవేళ బంతి బ్యాటును తాకితే దాన్ని ఔట్‌గా ప్రకటిస్తాడు. ఒకవేళ తాకకుంటే స్టంట్ ఔట్ అప్పీల్ ను పరిశీలిస్తారు. ఈ నిబంధన వల్ల బ్యాటర్లకు ప్రయోజనం కలగనుంది.