టీ20 ప్రపంచ కప్, 2025 ఛాంపియన్ ట్రోఫీ వేదికను మార్చే ఆలోచనలో ఐసీసీ.. ఎందుకంటే?
ఈ వార్తాకథనం ఏంటి
2024-2025 మధ్య టీ20 ప్రపంచ కప్, 2025లో ఛాంపియన్ ట్రోఫీ జరగనుంది. అయితే ఈ మేజర్ టోర్నీల వేదికల్లో మార్పులు చేసే సూచనలు కనిపిస్తున్నాయి.
ఈ వేదికలను మార్చడానికి ఐసీసీ సిద్ధంగా ఉన్నట్లు రిపోర్టులు పేర్కొంటున్నాయి.
2024 టీ20 ప్రపంచ కప్ వెస్టిండీస్, అమెరికా వేదికలుగా జరగాల్సి ఉంది. అయితే దీన్ని మార్చాలని ఐసీసీ భావిస్తున్నట్లు టాక్ నడుస్తోంది.
మరోవైపు పాకిస్థాన్ లో జరగాల్సిన 2025 వన్డే ఛాంపియన్ ట్రోఫీ టోర్నిని వెస్టిండీస్, అమెరికా దేశాల్లో నిర్వహించాలని ఐసీసీ ఆలోచిస్తున్నట్లు సమాచారం.
ఈ విషయంపై ఐసీసీ ఇంకా ఎలాంటి ప్రకటన చేయకపోవడం గమనార్హం.
Details
త్వరలో కీలక నిర్ణయం తీసుకోనున్న ఐసీసీ
2025 ఛాంపియన్స్ ట్రోఫీ అతిథ్యాన్ని కోల్పోనున్న పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు నష్టపరిహారం చెల్లించాలని ఐసీసీ భావిస్తోందట.
ప్రస్తుతం ఈ మార్పులు చర్చల దశలో ఉన్నాయని, ఐసీసీ త్వరలో ఏదో నిర్ణయం వెల్లడించే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం.
అదే విధంగా 2024 టీ20 ప్రపంచ కప్ టోర్నీని వెస్టిండీస్, అమెరికా నుంచి తరలించి స్కాట్ లాండ్, ఐర్లాండ్ ల్లో సంయుక్తంగా నిర్వహించాలని ఐసీసీ ప్లాన్ చేస్తోందట.
ముఖ్యంగా వెస్టిండీస్, అమెరికాల్లో టీ20 ప్రపంచ కప్ లాంటి టోర్నీ నిర్వహిస్తే బ్రాడ్ కాస్టర్లు నష్టపోయే ప్రమాదం ఉంది.
దీంతో ఐసీసీ వేదికల మార్పునకు శ్రీకారం చూడుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ వ్యవహారంపై ఐసీసీ త్వరలో ఓ నిర్ణయం తీసుకొనే ఛాన్స్ ఉంది.