Page Loader
వన్డే వరల్డ్ 2023లో మరో కొత్త ట్విస్ట్.. నరేంద్ర మోదీ స్టేడియంలో ఆడలేమన్న పాకిస్థాన్
రోహిత్ శర్మ, బాబర్ అజం

వన్డే వరల్డ్ 2023లో మరో కొత్త ట్విస్ట్.. నరేంద్ర మోదీ స్టేడియంలో ఆడలేమన్న పాకిస్థాన్

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 09, 2023
01:38 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆక్టోబర్-నవంబర్ లో భారత్ వేదికగా జరగనున్న వన్డే వరల్డ్ కప్ లో మరో కొత్త ట్విస్ట్ ఎదురైంది. ఇప్పటికే ఈ వన్డే ప్రపంచ కప్ కోసం బీసీసీఐ సన్నహాలను ప్రారంభించింది. ముఖ్యమైన మైదానాల పునరుద్ధరణకు చర్యలు చేపడుతోంది. అయితే అహ్మదాబాద్‌లో టీమిండియాతో ఆడబోమని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు స్పష్టం చేసింది. ఈ మేరకు ఐసీసీని కోరినట్లు తెలుస్తోంది. అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియంలో ఎలాంటి లీగ్ మ్యాచులు నిర్వహించవద్దని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ నజామ్ సౌథీ ఐసీసీ అధ్యక్షుడు గ్రెగ్ బార్క్లే, చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారి జియోఫ్ అల్లార్డైస్‌లను అభ్యర్థించారు. చైన్నై, బెంగళూరు, కోల్‌కతాలో పాకిస్థాన్ మ్యాచులను షెడ్యూల్ చేయాలని కోరింది.

Details

వన్డే ప్రపంచ కప్ లో తలపడనున్న టీమిండియా-పాకిస్థాన్

ఈ వన్డే ప్రపంచ కప్‌లో టీమిండియా, పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి. ప్రపంచలోనే పెద్ద క్రికెట్ స్టేడియం అయిన నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ మ్యాచును నిర్వహించాలని బీసీసీఐ ప్రతిపాదనలు చేసింది. అయితే ఈ మైదానంలో ఆడేందుకు పాకిస్థాన్ నో చెప్పింది. ఇప్పటికే ఆసియా కప్ నుంచి టీమిండియా వైదొలిగింది. టోర్నమెంట్ ను తటస్థ వేదికలో నిర్వహించాలని పేర్కొంది. వన్డే ప్రపంచ కప్ మైదానాల విషయంలో బీసీసీఐ కి పాక్ బోర్డు కొత్త సమస్యను సృష్టిస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా ఈ విషయంలో బీసీసీఐ వెనక్కి తగ్గకూడదని నిర్ణయించుకుంది.