Page Loader
Azmatullah Omarzai : ఆఫ్ఘ‌నిస్తాన్ ఆల్‌రౌండ‌ర్‌కు ఐసీసీ వ‌న్డే క్రికెట‌ర్ ఆఫ్ ద ఇయ‌ర్ అవార్డు
ఆఫ్ఘ‌నిస్తాన్ ఆల్‌రౌండ‌ర్‌కు ఐసీసీ వ‌న్డే క్రికెట‌ర్ ఆఫ్ ద ఇయ‌ర్ అవార్డు

Azmatullah Omarzai : ఆఫ్ఘ‌నిస్తాన్ ఆల్‌రౌండ‌ర్‌కు ఐసీసీ వ‌న్డే క్రికెట‌ర్ ఆఫ్ ద ఇయ‌ర్ అవార్డు

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 27, 2025
02:30 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆఫ్ఘానిస్థాన్ ఆల్‌రౌండర్ అజ్మతుల్లా ఓమర్‌జాయ్ ఐసీసీ వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును గెలుచుకున్నాడు. 2024లో తన పేస్ బౌలింగ్‌తో పాటు శక్తివంతమైన బ్యాటింగ్‌తో అజ్మతుల్లా అత్యుత్తమ ఆటగాడిగా నిలిచాడు. ఐసీసీ ఇవాళ ఈ ఏడాది వన్డే క్రికెటర్‌గా అజ్మతుల్లా పేరును ప్రకటించింది. 24 ఏళ్ల వయసులో అజ్మతుల్లా తన వన్డే కెరీర్‌ను అసాధారణంగా తీర్చిదిద్దుకుని, వన్డే క్రికెట్‌లో అత్యంత ప్రభావవంతమైన ఆటగాడిగా మారాడు. ఆఫ్ఘానిస్థాన్ జట్టులో అతను అత్యధిక పరుగులు చేసిన రెండో బ్యాటర్‌గా నిలిచాడు. గతేడాది మొత్తం 417 పరుగులు చేసి జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. బౌలింగ్‌లో కూడా అజ్మతుల్లా 14 మ్యాచ్‌ల్లో 17 వికెట్లు తీసుకున్నాడు.

Details

అల్ రౌండర్ ప్రదర్శనతో ఆకట్టుకున్న అజ్మతుల్లా ఓమర్ జాయ్

అజ్మతుల్లా ప్రదర్శనతో ఆఫ్ఘాన్ జట్టు ఐర్లాండ్, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్, జింబాబ్వేతో జరిగిన నాలుగు సిరీస్‌లలో విజయాలను సాధించింది. బ్యాటింగ్‌లో 52.12 సగటుతో పరుగులు చేయడం, బౌలింగ్‌లో 20.47 సగటుతో వికెట్లు తీయడం అతని ప్రతిభకు నిదర్శనం. శ్రీలంకతో జరిగిన ఒక వన్డేలో అజ్మతుల్లా 149 పరుగులు చేయగా, దక్షిణాఫ్రికాతో జరిగిన మరో మ్యాచ్‌లో 50 బంతుల్లో 86 పరుగులు చేశాడు. గతేడాదిలో తన ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అజ్మతుల్లా ఓమర్‌జాయ్ క్రికెట్ ప్రపంచంలో తనకంటూ ఓ ప్రత్యేకస్థానాన్ని పొందాడు.