Sree Charani: ఐసీసీ ర్యాంకింగ్స్.. తొలి భారత ప్లేయర్‌గా శ్రీ చరణి రికార్డు
ఈ వార్తాకథనం ఏంటి
మహిళల ఆసియా కప్ (Women's Asia Cup 2026)లో అద్భుతంగా రాణించిన భారత అమ్మాయిలు ఈ వారం తమ ఐసీసీ ర్యాంకింగ్స్‌ను గణనీయంగా మెరుగుపర్చుకున్నారు. శ్రీలంకతో జరిగిన ఫైనల్లో నాలుగు వికెట్లు పడగొట్టిన తెలుగమ్మాయి శ్రీ చరణి (Sree Charani) బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో తన అగ్రస్థానాన్ని మరింత పటిష్ఠం చేసుకుంది. ఈ స్పిన్నర్ తన కెరీర్‌లో తొలిసారి 800 రేటింగ్ పాయింట్ల మార్క్‌ను దాటింది. ప్రస్తుతం శ్రీ చరణి 804 రేటింగ్ పాయింట్లతో కొనసాగుతోంది. దీంతో మిథాలీరాజ్ 2011లో సాధించిన 780 రేటింగ్ పాయింట్లను అధిగమించింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో 800 రేటింగ్ పాయింట్లు సాధించిన తొలి భారత మహిళా క్రికెటర్‌గా శ్రీ చరణి చరిత్ర సృష్టించింది.
వివరాలు
రెండో స్థానానికి దీప్తి శర్మ
అంతేకాదు.. టీ20ల్లో బౌలింగ్ విభాగంలో ఆల్‌టైమ్ అత్యుత్తమ రేటింగ్ పాయింట్లు సాధించిన క్రికెటర్ల జాబితాలో శ్రీ చరణి రెండో స్థానానికి చేరుకుంది.
మరో మూడు రేటింగ్ పాయింట్లు సాధిస్తే.. ఆస్ట్రేలియా క్రికెటర్ మేగన్ షట్ 2001లో సాధించిన 806 పాయింట్లను అధిగమించి కొత్త రికార్డు నెలకొల్పే అవకాశం శ్రీ చరణికి ఉంది.
మహిళల ఆసియా కప్‌లో అద్భుతంగా రాణించిన మరో భారత స్పిన్నర్ దీప్తి శర్మ కూడా ఐసీసీ ర్యాంకింగ్స్‌లో భారీగా ముందుకు దూసుకొచ్చింది.
ఈ టోర్నీలో 14 వికెట్లు పడగొట్టి టాప్ వికెట్ టేకర్‌గా నిలిచిన దీప్తి శర్మ 729 రేటింగ్ పాయింట్లతో నాలుగు స్థానాలు ఎగబాకి రెండో ర్యాంక్‌కు చేరుకుంది.
వివరాలు
ఆరో ర్యాంకులో షెఫాలీ వర్మ
ఇక ఆసియా కప్‌లో 236 పరుగులతో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచిన షెఫాలి వర్మ బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో ఒక స్థానం మెరుగుపరుచుకుని ఆరో ర్యాంక్ దక్కించుకుంది.
మరోవైపు స్మృతి మంధాన ఐదో ర్యాంక్‌లో, హర్మన్‌ప్రీత్ కౌర్ 10వ ర్యాంక్‌లో కొనసాగుతున్నారు. ఆల్‌రౌండర్ల జాబితాలోనూ షెఫాలి వర్మ తన ర్యాంకింగ్‌ను మెరుగుపర్చుకుంది.
221 రేటింగ్ పాయింట్లతో ఆమె ఐదు స్థానాలు ఎగబాకింది. దీంతో తన కెరీర్‌లోనే అత్యుత్తమ రేటింగ్ పాయింట్లను షెఫాలి వర్మ సాధించింది.