వివాదాస్పద నిబంధనను తొలగిస్తూ ఐసీసీ కీలక నిర్ణయం!
వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ ముందు ఐసీసీ కీలక నిర్ణయం తీసుకుంది. క్రికెట్లో వివాదాస్పదంగా మారిన సాప్ట్ సిగ్నల్ నిబంధనను ఐసీసీ తొలగించింది. భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ నుంచి ఈ నిబంధన అమలు కానుంది. అయితే ఈ విషయంపై ఇంకా పూర్తిగా స్పష్టత రాలేదు. ఈ మేరకు ఈ విషయాన్ని ప్రముఖ క్రికెట్ వెబ్ సైట్ క్రిక్‌బజ్ తెలిపింది. సాప్ట్ సిగ్నల్ పై గతంలోనే మాజీ క్రికెటర్ల నుండి విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. వివాదాలకు కారణమవుతున్న ఈ నిబంధనను తొలగించే ప్రతిపాదనను సౌరబ్ గంగూలీ సారథ్యంలోని ఐసీసీ కమిటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా సమాచారం.
జూన్ 7 నుంచి భారత్-ఆస్ట్రేలియా మధ్య డబ్య్లూటీసీ ఫైనల్
రివ్యూల్లో స్పష్టత రాని సమయంలో థర్డ్ అంపైర్, ఫీల్డ్ అంపైర్ సాప్ట్ సిగ్నల్ ను పరిగణలోకి తీసుకొన్ని నిర్ణయాన్ని వెల్లడిస్తారు. దీంతో అనేక సందర్భాల్లో అంపైర్ సాప్ట్ సిగ్నల్ కు కట్టుబడి ఫైనల్ నిర్ణయాన్ని వెల్లడించడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. దీంతో సాప్ట్ సిగ్నల్ నిబంధనను ఎత్తివేయాలని ఐసీసీ భావిస్తున్నట్లు సమాచారం. సాప్ట్ సిగ్నల్ విషయంలో చాలా అంతర్జాతీయ మ్యాచులలో పెద్ద దూమారమే రేగింది. 2021లో భారత్-ఇంగ్లాండ్ మధ్య టీ20 సిరీస్ లోనూ సాప్ట్ సిగ్నల్ పై చర్చ జరిగింది. భారత్-ఆస్ట్రేలియా మధ్య జూన్ 7 నుంచి 11 వరకూ డబ్య్లూటీసీ ఫైనల్ మ్యాచ్ జరగనుంది.