Page Loader
ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ శ్రీలంక లెగ్ స్పిన్నర్ హసరంగ సత్తా
టీ20ల్లో టాప్ ర్యాంక్ బౌలర్‌గా నిలిచిన హసరంగా

ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ శ్రీలంక లెగ్ స్పిన్నర్ హసరంగ సత్తా

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 23, 2023
04:38 pm

ఈ వార్తాకథనం ఏంటి

హసరంగా టీ20 ఫార్మాట్‌లో సంచలనం సృష్టించాడు. ఐసీసీ టీ20 బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో శ్రీలంక లెగ్ స్పిన్నర్ వనిందు హసరంగ సత్తా చాటాడు. అగ్రస్థానంలో కొనసాగుతున్న అప్ఘనిస్తాన్ లెగ్ స్పిన్నర్ రషీద్ ఖాన్‌ను హసరంగ వెనక్కి నెట్టి మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. తాజాగా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ బుధవారం ఇదే విషయాన్ని ప్రకటించింది. UAEకి వ్యతిరేకంగా ఇటీవల ముగిసిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో రషీద్ కేవలం నాలుగు వికెట్లు మాత్రమే సాధించాడు. ఆఫ్ఘనిస్తాన్ 2-1 తేడాతో సిరీస్‌ను గెలిచింది. 695 పాయింట్లతో హసరంగా మొదటి స్థానం, 694 పాయింట్లతో రషీద్ రెండో స్థానంలో ఉన్నాడు నిలిచాడు.

హసరంగా

హసరంగా సాధించిన రికార్డులివే

2019లో టీ20లో అరంగేట్రం చేసిన హసరంగ 55 మ్యాచ్‌లను ఆడాడు. 6.8 ఎకానమీ రేటుతో 89 వికెట్లు పడగొట్టి సంచలనం సృష్టించాడు. శ్రీలంక ఆటగాళ్లలో లసిత్ మలింగ 107 టీ20 మ్యాచ్‌లు మొదటి స్థానంలో నిలిచాడు. హసరంగా గతేడాది 19 టీ20 మ్యాచ్ లు ఆడి 34 వికెట్లను తీశాడు. శ్రీలంక తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. జూన్‌లో ఆస్ట్రేలియాపై హసరంగా 4/33తో రాణించిన విషయం తెలిసిందే. పాకిస్థాన్‌కు చెందిన ఉమర్ గుల్‌తో పాటు, ICC T20 ప్రపంచకప్ ఎడిషన్‌లో రెండుసార్లు అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా హసరంగా నిలిచాడు. 2021లో ఎనిమిది మ్యాచ్ లు ఆడి 16 వికెట్లు తీసిన మొదటి బౌలర్ రికార్డుకెక్కాడు.