LOADING...
టీ20 ఉమెన్స్ ప్రపంచ కప్‌లో ఈ ఆటగాళ్లపై భారీ అంచనాలు
స్మృతి మంధాన WT20Iలో 600 పరుగులు చేసింది

టీ20 ఉమెన్స్ ప్రపంచ కప్‌లో ఈ ఆటగాళ్లపై భారీ అంచనాలు

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 07, 2023
10:41 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇటీవల ఐసీసీ తొలిసారిగా నిర్వహించిన అండర్-19 మహిళల టీ20 ప్రపంచ కప్‌లో ఇండియా విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. ఇప్పుడు టీమిండియా మరో సమరానికి సిద్ధమైంది. ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్ దక్షిణాఫ్రికాలో ఈనెల 10న ప్రారంభ కానుంది. ఇండియా, పాకిస్తాన్, న్యూజిలాండ్ జట్టులో ఎంతోమంది సమర్థులైన ఆటగాళ్లు ఉన్నారు. ఈ టోర్నిలో కీలక ఆటగాళ్లు సిక్సర్లు, ఫోర్లతో స్టేడియాన్ని మోత మోగించడానికి సిద్ధమయ్యారు. ఆస్ట్రేలియాకు చెందిన మెక్‌గ్రాత్ ఆలౌరౌండర్‌గా రాణిస్తోంది. ఆమె కామన్వెల్త్ గేమ్స్ లో స్వర్ణం గెలుచుకోవడంతో కీలక పాత్ర పోషించింది. ఆమె 2022 సంవత్సరానికి ICC మహిళా T20I క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా కూడా ఎంపికైంది.

స్మృతిమంధాన

స్మృతిమంధానపై భారీ ఆశలు

న్యూజిలాండ్‌కు చెందిన కెప్టెన్ సోఫీ‌డివైన్ బ్యాటింగ్, బౌలింగ్ విభాగంలో చక్కగా రాణిస్తోంది. ఆల్‌రౌండర్ల ఉమెన్స్ టీ20 ర్యాంకింగ్స్‌లో మూడో స్థానంలో ఉంది. టీ20 వరల్డ్ కప్‌లో 652 పరుగులు చేసి, 29 వికెట్ల తీసింది. గతేడాది ఆడిన 14 మ్యాచ్‌ల్లో 29.92 సగటుతో 389 పరుగులు చేసి, 13 వికెట్లను పడగొట్టింది. పాకిస్థాన్ చెందిన ఆల్‌రౌండర్ నిదాదార్ 2022లో అద్భుతమైన బ్యాటింగ్‌తో అదరగొట్టింది. ఆమె 56.57 సగటుతో 396 పరుగులు చేసింది. ఆమె ఆరు మ్యాచ్‌లలో 72.50 సగటుతో 145 పరుగులు చేసింది. టీమిండియా స్మృతిమంధానపై భారీ అంచనాలను పెట్టుకుంది. ఓపెనింగ్ బ్యాటర్ గతేడాది 594 పరుగులు చేసింది. గత నెలలో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో 74* పరుగులుతో వీరవిహారం చేసింది.