బీసీసీఐ కంటే ఐసీసీ పెద్ద తోపు కాదు: షాహిద్ అఫ్రిది
ఆసియా కప్ వివాదం రోజురోజుకు మరింత ముదురుతోంది. ఇప్పటికే అతిథ్యం ఇవ్వాల్సిన పాకిస్తాన్ భారత్ కచ్చితంగా పాల్గొనాలని కోరుతోంది. అయితే భద్రతా కారాణాల రీత్యా పాకిస్తాన్‌లో తాము ఆడే ప్రసక్తి లేదంటూ ఇప్పటికే బీసీసీఐ చీఫ్ కార్యదర్శి జేషా ప్రకటించిన విషయం తెలిసింది. 2023 ఆసియా కప్‌కు ఆతిథ్యమిచ్చే వేదికపై నెలకొన్న గందరగోళానికి తెరపడేలా కనిపించడం లేదు. ఇటీవల ఈ వ్యవహారంపై దుబాయిలో సమావేశం నిర్వహించినా సమస్య ఓ కొలక్కి రాలేదు. అయితే దీనిపై భారత్ వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మాట్లాడారు. ఆసియా కప్ కోసం టీమిండియా వెళ్లకపోతే.. భారతదేశంలో జరిగే వన్డే ప్రపంచ కప్‌ను పాకిస్తాన్ దాటవేయడం సాధ్యం కాదని తన అభిప్రాయాన్ని అశ్విన్ వెల్లడించారు.
ఆశ్విన్ వ్యాఖ్యలపై స్పందించిన ఆఫ్రిది
అశ్విన్ వ్యాఖ్యపై పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది స్పందించాడు. ఆసియా కప్ కోసం భారత్ పాకిస్తాన్‌ను సందర్శిస్తుందా లేదా, టీమిండియాలో జరిగే వన్డే ప్రపంచ కప్ ను తాము బహిష్కరిస్తామనా అన్న దానిపై ఓ నిర్ణయం తీసుకుంటామని ఆఫ్రిది చెప్పాడు. ఇందులో ఐసీసీ పాత్ర కీలకమని, అయితే బీసీసీఐ ముందు ఐసీసీ ఏమీ చేయలేదని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం షాహిద్ ఆఫ్రిది చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ఆఫ్రిది మాటలపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు