
పాక్ జట్టును ఇండియాకు పంపిస్తే భద్రతా సమస్యలు: పీసీబీ ఛైర్మన్
ఈ వార్తాకథనం ఏంటి
ఆసియా కప్ 2023 టోర్ని వేదిక విషయంలో రేగిన సందిగ్ధత ఇప్పట్లో తెగేలా లేదు. పాకిస్తాన్ లో ఆసియా కప్ 2023 టోర్ని జరగాల్సి ఉంది. అయితే పాక్‌లో నిర్వహిస్తే అక్కడికి టీమిండియా వెళ్లదని, తటస్థ వేదికపై టోర్నిని నిర్వహిస్తామని బీసీసీఐ సెక్రటరీ జైషా చెప్పిన విషయం తెలిసిందే.
ఆసియాకప్ కోసం టీమిండియా పాకిస్తాన్‌కి రాకపోతే పాక్ టీమ్ కూడా వన్డే వరల్డ్ కప్ 2023 కోసం ఇండియాకి వెళ్లదని అప్పటి పీసీబీ చైర్మన్ రమీజ్‌రాజా చేసిన వ్యాఖ్యలు దూమారం రేపాయి. దీనిపై ప్రస్తుత చైర్మన్ నజాం సౌథీ స్పందించారు.
ఈ విషయంలో ఉన్న ఆప్షన్లు అన్నింటినీ పట్టించుకొని స్పష్టమైన నిర్ణయం తీసుకుంటామని, ఈ అంశంపై ఐసీసీ సమావేశాల్లో చర్చిస్తామని నజాంసౌథీ వెల్లడించారు.
ఇండియా
ఇండియా ప్రతిపాదనను ఒప్పుకోం
మిగిలిన అన్ని జట్లు పాకిస్తాన్‌కు వస్తున్నప్పుడు, టీమిండియాకు రావడానికి భయపడడం దేనికని, అలాగే తమ జట్టును భారత్‌కు పంపిస్తే భద్రతా సమస్యలొస్తాయని, తాను ఈ విషయంపై రాబోయే సమావేశాల్లో చర్చకు తీసుకొస్తామని నజాం సౌథీ వెల్లడించారు.
తటస్థ వేదికపై ఆసియా కప్ నిర్వహించాలనే ఇండియా ప్రతిపాదనను తాము ఒప్పుకోమని, ఇది ఆసియా కప్, వరల్డ్ కప్‌తో ఆగదని, తమ ప్రభుత్వం కూడా ఆసియా కప్ ఇక్కడే నిర్వహించాలని అనుకుంటోందని సౌథీ పేర్కొన్నారు.
ఈ ఆసియా కప్ వివాదం ఎప్పుడు ముగుస్తుందో తెలియాలంటే కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.