సూర్యకుమార్‌కు అవకాశమిస్తే.. ప్రపంచకప్‌లో దుమ్మురేపుతాడు : యూవీ
ఈ వార్తాకథనం ఏంటి
టీ20ల్లో ప్రత్యర్థి బౌలర్లకు టీమిండియా స్టార్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ చుక్కలు చూపిస్తాడు. అయితే వన్డేల్లో మాత్రం విఫలమవుతూ విమర్శలను ఎదుర్కొంటున్నాడు.
ఆసీస్‌తో జరిగిన మూడు వన్డేలో సూర్యకుమార్ యాదవ్ డకౌట్ అయ్యాడు. దీంతో అతడిని వన్డేల నుంచి తప్పించి టీ20లకే పరిమితం చేయాలని కొంతమంది డిమాండ్ చేస్తున్నారు. అయితే అతనికి భారత మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ మద్దతుగా నిలిచాడు.
వన్డేల్లో సూర్య మున్ముందు రాణించే అవకాశం ఉందని, ఈ ఏడాది జరిగే వన్డే వరల్డ్ కప్‌లో అతనికి అవకాశం వస్తే దుమ్ములేపుతాడని యువరాజ్ సింగ్ తెలిపాడు.
సూర్యకుమార్ యాదవ్
సూర్యకుమార్ యాదవ్ వన్డేల్లో రాణిస్తాడు
ప్రతి క్రీడాకారుడు తన కెరీర్‌లో ఎత్తుపల్లాలను చూస్తాడని, చాలామంది ప్లేయర్లు వాటిని అనుభవించారని, భవిష్యతులో టీమిండియాకు కీలక ఆటగాడిగా సూర్యకుమార్ మారుతాడని యూవీ ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ ఏడాది అక్టోబర్- నవంబర్ మధ్య వన్డే ప్రపంచ కప్ జరగనుంది. ఈ మెగా టోర్నీకి టీమిండియానే ఆతిథ్యం ఇస్తోంది.
టీ20ల్లో అదరగొట్టే సూర్యకుమార్ వన్డేల్లో మాత్రం విఫలమవుతున్నాడు. ఇప్పటివరకు 21 వన్డేలు ఆడి 433 పరుగులను మాత్రమే చేశాడు. వారం రోజుల్లో జరగనున్న ఐపీఎల్ టోర్నిలో సూర్య రాణిస్తే భవిష్యతులో అతడిని వన్డే వరల్డ్ కప్ కి సెలెక్ట్ చేసే అవకాశాలు ఉండనున్నాయి.