
సూర్యకుమార్ యాదవ్ హ్యాట్రిక్ గోల్డెన్ డక్స్‌తో చెత్త రికార్డు
ఈ వార్తాకథనం ఏంటి
టీమిండియా టాప్ ఆర్డర్ బ్యాటర్ సూర్యకుమార్ అత్యంత చెత్త రికార్డును నమోదు చేశారు. మొన్నటి వరకు టీ20ల్లో ఇరగదీన అతడు.. వన్డేల్లో చెత్త ప్రదర్శనతో విఫలమవుతున్నాడు.
ఆస్ట్రేలియాతో జరిగిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో మూడింట్లోనూ గోల్డన్ డకౌట్ అయ్యాడు. దీంతో మూడు మ్యాచ్‌లోనూ తొలి బంతికే గోల్డెన్ డకౌటై చెత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.
ముంబయి వేదికగా జరిగిన తొలి వన్డేలో, విశాఖపట్నం వేదికగా జరిగిన రెండో మ్యాచ్‌లో మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా సూర్యకుమార్ వెనుతిరిగాడు.
మూడో వన్డేలో మాత్రం ఆష్తన్ అగర్ స్పిన్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. వరుసగా మూడు వన్డేల్లోనూ తొలి బంతికే గోల్డెన్ డకౌటైన మొదటి భారత బ్యాటర్‌గా సూర్యకుమార్ యాదవ్ నిలిచాడు.
సూర్యకుమార్ యాదవ్
అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయిన సూర్యకుమార్ యాదవ్
ఇలాంటి చెత్త రికార్డును సూర్యకుమార్ యాదవ్ కంటే ముందు సచిన్ టెండుల్కర్(1994), అనిల్ కుంబ్లే(1996), జహీర్ ఖాన్(2003-04), ఇషాంత్ శర్మ (2010-11), జస్ప్రిత్ బుమ్రా(2017-19) ఉన్నారు. వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో లసిత్ మలింగ, క్రెయిగ్ వైట్, హెన్రీ ఒలోంగా గతంలో డకౌట్ అయ్యారు.
ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ ముందు శ్రేయాస్ అయ్యర్ గాయపడటంతో అతని స్థానంలో సూర్యకుమార్ యాదవ్‌కి అవకాశం దక్కింది. వచ్చిన అవకాశాన్ని సూర్యకుమార్ యాదవ్ వినియోగించుకోలేకపోయాడు.
చివరి వన్డేలో ఆసీస్ స్పిన్నర్ ఆడం జంపా 4 వికెట్లతో రాణించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. మూడు మ్యాచ్‌ల్లో బ్యాటింగ్‌తో రాణించిన మిచెల్ మార్ష్ మ్యాన్ ఆఫ్ ది సిరీస్‌గా ఎంపికయ్యాడు.