
భారత్‌పై ఆస్ట్రేలియా ఘనవిజయం.. చేతులెత్తిసిన టీమిండియా
ఈ వార్తాకథనం ఏంటి
ఆస్ట్రేలియా తో జరిగిన మూడో వన్డేలో భారత్ 21 పరుగుల తేడాతో ఓడిపోయింది. దీంతో 3 వన్డేల సిరీస్ ను టీమిండియా 1-2తో కోల్పోయింది. తొలి నుంచి భారత్ గెలుపు దిశగా సాగగా.. సూర్యకుమార్ యాదవ్, హార్ధిక్ పాండ్యా, రవీంద్ర జడేజా వికెట్లు కోల్పోవడంతో మ్యాచ్ ఆస్ట్రేలియా చేతిలోకి వెళ్లింది.
తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 49 ఓవర్లలో 269 పరుగులు చేసి ఆలౌటైంది. ఆస్ట్రేలియా ఓపెనర్ హెడ్ 33 పరుగులు, మిచైల్ మార్ష్ 47 పరుగులతో ఆస్ట్రేలియాకు శుభారంభాన్ని అందించారు.
కెప్టెన్ స్టీవన్ స్మిత్ డకౌట్ తో నిరాశ పరిచాడు. అలెక్స్ కెరీ 38 పరుగులు, స్టోయినిస్ 25 పరుగులు ఫర్వాలేదనిపించినా మిగతా బ్యాటర్లు నిరాశ పరిచారు.
టీమిండియా
విఫలమైన టీమిండియా బ్యాటర్లు
టీమిండియా బౌలర్లలో హర్ధిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్ మూడు వికెట్లు పడగొట్టగా.. సిరాజ్, అక్షర్ తలో రెండు వికెట్లు తీశారు.
లక్ష్య చేధనకు దిగిన టీమిండియా ఓపెనర్లు రోహిత్ శర్మ, గిల్ శుభారంభం అందించగా.. టాప్ ఆర్డర్ బ్యాటర్లు విఫలమయ్యారు. రోహిత్ శర్మ 30 పరుగులు, గిల్ 37 పరుగులతో రాణించగా.. విరాట్ కోహ్లీ 54 పరుగులతో టీమిండియాను అదుకొనే ప్రయత్నం చేశాడు. అయితే సూర్యకుమార్ యాదవ్, హర్ధిక్ పాండ్యా, జడేజా వికెట్లను త్వరత్వరగా కోల్పోవడంతో టీమిండియా కష్టాల్లో పడింది.
చివర్లో మహ్మద్ షమీ బౌండరీలు,సిక్స్ బాదినా.. రన్ రేట్ ఎక్కువగా ఉండటంతో ఫలితం లేకుండా పోయింది. దీంతో టీమిండియా 49.1 ఓవర్లలో 248 పరుగులకు ఆలౌటైంది.