
పనిభారం ఎక్కువైతే ఐపీఎల్ ఆడటం మానేయండి : రవిశాస్త్రి
ఈ వార్తాకథనం ఏంటి
ప్రపంచకప్ సమీపిస్తున్నందున అన్ని జట్లు ఇప్పటికే సన్నహాలు మొదలెట్టాయి. ఇలాంటి తరుణంలో కీలక ఆటగాళ్లు గాయాల భారీన పడటం భారత్‌ని కలవరపెడుతోంది. రోడ్డు ప్రమాదంలో గాయపడిన రిషబ్ పంత్ ఎప్పటికి కోలుకుంటాడో తెలియదు.
గాయాల కారణంగా ఇప్పటికే జస్ప్రిత్ బుమ్రా, శ్రేయస్ అయ్యర్ లాంటి అటగాళ్లు మ్యాచ్‌లకు దూరమయ్యాడు. అయితే మరికొన్ని రోజుల్లో ఐపీఎల్ ప్రారంభమవుతోంది.ఈ మెగా టోర్నిలో స్టార్ ఆటగాళ్ల తమ ఫిట్ నెస్‌ను కాపాడుకోవాలి.
దీనిపై తాజాగా మాజీ కోచ్ రవిశాస్త్రి బీసీసీఐకి కీలక సూచన చేశాడు. ప్రపంచ కప్‌ని దృష్టిలో ఉంచుకొని కీలక ఆటగాళ్లు మ్యాచ్ ల భారాన్ని తగ్గించేందుకు ఐపీఎల్ ఫ్రాంచేజీతో బీసీసీఐ మాట్లాడాలని అతడు చెప్పారు. అవసరమైతే ఆ ఆటగాళ్లు ఐపీఎల్‌లో ఆడకూడదని సూచించాడు.
రవిశాస్త్రి
ఆటగాళ్ల విశ్రాంతి కావాలి
కెప్టెన్ రోహిత్ శర్మ నేతృత్వంలో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (డబ్ల్యుటిసి) ఫైనల్, సొంత గడ్డపై వన్డే ప్రపంచ కప్ జరగనున్నాయి. ఆస్ట్రేలియాతో సిరీస్ ఓటమి తర్వాత భారత కెప్టెన్ రోహిత్ స్టార్ ఆటగాళ్లకు తగినంత విశ్రాంతి అవసరమని తెలియజేసిన విషయం తెలిసిందే.
తాము క్రికెట్ ఆడినప్పుడు మెరుగైన సౌకర్యాలు లేవని, అయినా 8-10 సంవత్సరాలు సులభంగా ఆడామని, ప్రస్తుతం అప్పటికంటే ఇప్పుడు ఎక్కువ మ్యాచ్ లు జరుగుతున్నాయని, లీగ్ ల కారణంగా ఆటగాళ్లకు విశ్రాంతి దొరకడం లేదని దీనిపై బీసీసీఐ బాధ్యత తీసుకోవాలని రవిశాస్త్రి తెలియజేశాడు.
టీమిండియాకు స్టార్ ఆటగాళ్ల సేవలు అవసరమని, అలాంటి వారు ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడకపోతే మంచిదని ఆయన చెప్పారు.