ఆస్ట్రేలియా దిగ్గజానికి దిమ్మతిరిగే రిప్లే ఇచ్చిన రవిశాస్త్రి
టీమిండియా-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మూడో టెస్టులో ఆసీస్ స్పిన్నర్లు విజృంభించారు. ఇండోర్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ 109 పరుగులకే ఆలౌటైంది. ఆరో ఓవర్లో బౌలింగ్ అటాక్ ఆరంభించిన ఆసీస్ స్పిన్నర్ మాథ్యూ కుహ్నెమన్.. కెప్టెన్ రోహిత్ శర్మ(12) వికెట్‌తో ఖాతా తెరిచాడు. ఈ మ్యాచ్‌లో మాథ్యూ కుహ్నెమన్ ఐదు వికెట్లు, నాథన్ లియోన్ మూడు వికెట్లు, మర్ఫి ఒక వికెట్ తీశారు. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా దిగ్గజం మథ్యూ హెడెన్ ఇండోన్ పిచ్‌ను విమర్శిస్తూ కీలక వ్యాఖ్యలు చేశాడు. ప్రపంచంలో ఎక్కడా కూడా టెస్టు మ్యాచ్ మొదటి రోజు ఆటలో స్పిన్నర్ ఆరో ఓవర్లో బౌలింగ్ రాడని, టీమిండియా కోచ్ రవిశాస్త్రితో కామెంట్రీలో భాగంగా మాథ్యూ హెడెన్ చెప్పారు.
హోం కండిషన్స్ అంటూ రవిశాస్త్రి కౌంటర్
వికెట్లు కోల్పోతున్నా భారత్ శిబిరంలో చిరాకు లేదని, ఈ పిచ్‌పై బంతి ఎక్కువగా టర్న్ కావడం వల్ల ఈపిచ్ పై అనుమానాలున్నాయని రవిశాస్త్రితో పేర్కొన్నాడు. ఏ టెస్టు మ్యాచ్‌లోనూ ఆరో ఓవర్ స్పిన్నర్ తో వేయించరని, ఇండోర్ లో మూడో రోజు నుంచి బంతి టర్న్ అవుతుందని అంచనా వేశామని, బ్యాటర్లకు కూడా అవకాశం రావాలని కదా అని రవిశాస్త్రి వివరించారు. మొదటి, రెండో రోజు బ్యాటింగ్ కు అనుకూలించాలని కదా అని హెడెన్ పేర్కొనగా.. రవిశాస్త్రి ఒక్కమాటతో ''హోం కండిషన్స్'' అంటూ హెడెన్‌కు అదిరిపోయే జవాబు ఇచ్చాడు. సొంతగడ్డపై జట్లకు కాస్త అనుకూలమైన పిచ్‌లే రూపొందిస్తారని, అందుకు ఎవరూ అతీతులు కారన్న అర్థంలో హెడెన్‌కు రవిశాస్త్రి కౌంటర్ ఇచ్చాడు.