Page Loader
టీమిండియా గొప్ప జట్టు : పాక్ ప్లేయర్
టీమిండియాపై ప్రశంసలు కురిపించిన పాక్ ప్లేయర్

టీమిండియా గొప్ప జట్టు : పాక్ ప్లేయర్

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 27, 2023
04:42 pm

ఈ వార్తాకథనం ఏంటి

టీమిండియాపై పాకిస్తాన్ వెటరన్ వికెట్ కీపర్ కమ్రాన్ ఆక్మల్ ప్రశంసలు కురిపించాడు. భారత జట్టును తక్కువ చేయాల్సిన పనిలేదని, దశాబ్ద కాలంగా ఐసీసీ ట్రోఫీ గెలవకపోయినా భారత్ గొప్ప జట్టేనని తెలిపాడు. బీసీసీఐ అనుసరిస్తున్న విధానాల వల్లే టీమిండియా విజయవంతంగా ముందుకెళ్తుతోందని, పీసీబీ అధికారుల తీరును కమ్రాన్ ఆక్మల్ ఎండగట్టారు. ఈ ఏడాది శ్రీలంక, న్యూజిలాండ్‌లను భారత్ వైట్ వాష్ చేసిందని, అన్ని అంశాల్లోనూ భారత్ ఇతర జట్ల కంటే మెరుగ్గా ఉందని కమ్రాన్ ఆక్మల్ అభిప్రాయపడ్డాడు.

కమ్రాన్ ఆక్మల్

క్రికెట్‌ను భ్రష్టు పట్టించేవాళ్లు ఇండియాలో లేరు

ఒకవేళ టైటిల్ ప్రధానం అనుకుంటే.. న్యూజిలాండ్, సౌతాఫ్రికా జట్లను ఇప్పటికే నిషేధించాలని, ప్రతిసారి విజేతగా నిలవాలంటే కష్టమని కమ్రాన్ ఆక్మల్ పేర్కొన్నారు. ఏదిఏమైనా టీమిండియా ఇప్పటికీ గొప్ప జట్టేనని, అందులో ఎలాంటి సందేహం లేదన్నాడు. ఇండియాలో దేశవాళీ క్రికెట్‌ను భ్రష్టు పట్టించే వాళ్లు ఎవరూ లేరని, గత 7-8ఏళ్లుగా పాకిస్తాన్‌లో మాత్రం కొంతమంది పనిగట్టుకొని డొమెస్టిక్ క్రికెట్‌ను నాశనం చేస్తున్నారని వాపోయారు. 1983, 2011 వన్డే ప్రపంచకప్‌, 2007 టీ20 ప్రపంచకప్‌, 2002, 2013 చాంపియన్స్‌ ట్రోఫీ గెలిచిన టీమిండియా ఆ తర్వాత ఇంత వరకు ఒక్క ఐసీసీ టైటిల్‌ కూడా గెలవకపోవడం గమనార్హం.