కుల్దీప్ యాదవ్‌పై ప్రశంసల వర్షం కురిపించిన టీమిండియా మాజీ ప్లేయర్
టీమిండియా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌పై టీమిండియా మాజీ ప్లేయర్ వసీం జాఫర్ ప్రశంసల వర్షం కురిపించాడు. కుల్దీప్ అద్భుతమైన బౌలర్ అని, టీ20 సిరీస్‌లో మెరుగ్గా రాణిస్తాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా భారత్, న్యూజిలాండ్ నేడు రాంచిలో తలపడనున్నాయి. కుల్దీప్ యాదవ్ జాతీయ జట్టులో నిలకడగా రాణిస్తున్నాడని, గత రెండు సిరీస్‌లో వికెట్లు తీసి టీమిండియా విజయంలో కీలకపాత్ర పోషించారని జాఫర్ అన్నారు. మణికట్టు స్పిన్నర్ కీలక వికెట్లు పడగొడుతూ టీమిండియాలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకుంటున్నాడని జాఫర్ వెల్లడించారు.
కుల్దీప్‌కు సుస్థిర స్థానం కల్పించకపోవడం బాధాకరం
ఇంతకుముందు కుల్దీప్ కు చాలా తక్కువ అవకాశాలు ఇచ్చారని, అవకాశం వచ్చినప్పుడల్లా తనను తాను నిరూపించుకుంటూ ముందుకెళ్తున్నారని జాఫర్ ప్రశంసించాడు. అక్షర్ పటేల్ లేనందున మ్యాచ్ లోకి తీసుకుంటున్నారని, కుల్దీప్ మెరుగైన ప్రదర్శన ఇస్తున్నా జట్టులో స్థానం కల్పించకపోవడం బాధకరమన్నారు. ఆస్ట్రేలియాతో జరిగే బోర్డర్-గవాస్కర్ సిరీస్‌లో కుల్దీప్‌కు అవకాశం వస్తుందని అశాభావం వ్యక్తం చేశాడు. ఆర్షదీప్ సింగ్ ఈ టీ20 సిరీస్ లో తిరిగి పుంజుకుంటాడని, అతను బౌలింగ్ చేసే విధానం బాగుంటుందని జాఫర్ చెప్పుకొచ్చాడు.