హార్థిక్ పాండ్యాను కెప్టెన్‌ను చేస్తారా.. ఇర్ఫాన్ పఠాన్ ఆగ్రహం..!
2022లో టీమిండియా అశించిన విజయాలు సాధించకపోవడంతో సెలెక్టర్లతో పాటు బీసీసీఐకి కొత్త తలనొప్పులు మొదలయ్యాయి. టీమిండియా ఆటగాళ్లు బ్యాటింగ్, బౌలింగ్‌లో విఫలం చెందడంతో టీ20 ప్రపంచ కప్‌లో భారత్ సెమీస్‌లోనే ఇంటి బాట పట్టింది. వయస్సు మీద పడుతున్న రోహిత్‌శర్మను తప్పించి కొత్త కెప్టెన్‌ను నియమించేందుకు బీసీసీఐ నిమగ్నమైంది. ప్రపంచకప్ వైఫల్యం, వయోభారం కారణంగా రోహిత్ పొట్టి ఫార్మాట్ నుంచి తప్పుకునేందుకు సిద్ధమయ్యాడని వార్తలు వినిపిస్తున్నాయి. భారత్ జట్టు టీ20 కెప్టెన్‌గా స్టార్ ఆలౌరౌండర్ హార్ధిక్ పాండ్యాను నియమించడానికి బీసీసీఐ సిద్ధమైంది. రేపటి నుంచి శ్రీలంక జరగనున్న టీ20 సిరీస్‌కు హార్ధిక్ పాండ్యా కెప్టెన్ గా వ్యవహరించనున్నారు. ఇప్పటికే పలు టీ20ల్లో భారత కెప్టెన్ గా హార్ధిక్ పాండ్యాకు జట్టుకు విజయాలను అందించాడు.
ఫిట్‌నెస్‌పై శ్రద్ధ పెట్టాలి
తాజాగా భారత మాజీ ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పాండ్యాను రోహిత్ వారసుడిగా చేయాలనుకుంటే బీసీసీఐ కాస్త ఆలోచించాలని సెలెక్టర్లను పఠాన్ హెచ్చరించాడు. హార్ధిక్ పాండ్యా ఐపీఎల్ ల్ అదరొట్టాడు. గుజరాత్ టైటాన్స్‌కు ప్రాతినిథ్యం వహించి, జట్టుకు కప్పునందించాడు. కెప్టెన్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. టీమిండియాకు భవిష్యతులో సారిథిగా పాండ్యాను నియమించాలనుకుంటే పాండ్యా పిట్నెస్ మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఇర్ఫాన్ పఠాన్ పేర్కొన్నారు.