Page Loader
Rohit Sharma: అంతర్జాతీయ క్రికెట్‌లో అరుదైన ఫీట్‌ను సాధించిన రోహిత్ శర్మ
Rohit Sharma: అంతర్జాతీయ క్రికెట్‌లో 100 అర్ధ సెంచరీలు పూర్తి చేసిన రోహిత్ శర్మ

Rohit Sharma: అంతర్జాతీయ క్రికెట్‌లో అరుదైన ఫీట్‌ను సాధించిన రోహిత్ శర్మ

వ్రాసిన వారు Stalin
Nov 12, 2023
03:34 pm

ఈ వార్తాకథనం ఏంటి

రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్‌లో 100 హాఫ్ సెంచరీలు పూర్తి చేసిన ఆరో భారతీయ ఆటగాడిగా మరో మైలురాయిని అందుకున్నాడు. ప్రపంచ కప్‌-2023లో భాగంగా నెదర్లాండ్స్‌తో ఆదివారం జరిగిన చివరి లీగ్ గేమ్‌లో హాఫ్ సెంచరీ చేయడంతో రోహిత్ ఈ ఫీట్‌ను సాధించాడు. రోహిత్ శర్మ కంటే 100 అర్ధ సెంచరీలు సాధించిన జాబితాలో సచిన్ టెండూల్కర్ (164), విరాట్ కోహ్లీ (136), రాహుల్ ద్రవిడ్ (146), సౌరవ్ గంగూలీ (107), ఎంఎస్ ధోని (108) ఉన్నాడు. రోహిత్ శర్మ‌కు ఇది 460వ అంతర్జాతీయ మ్యాచ్. అన్ని మ్యాచ్‌లలో కలిపి, 43 ప్లస్ సగటుతో 18,100 పరుగులు చేసాడు.

రోహిత్

టెస్టు, వన్డే, టీ20ల్లో అర్ధశతకాల వివరాలు ఇవే.. 

52 టెస్టులు ఆడిన రోహిత్ 46.54 సగటుతో 3,677పరుగులు చేశాడు. ఈ ఫార్మాట్లో రోహిత్‌కు 10 సెంచరీలు, 16అర్ధ సెంచరీలు ఉన్నాయి. 2019లో దక్షిణాఫ్రికాపై టెస్టుల్లో రోహిత్ డబుల్ సెంచరీ (212)సాధించాడు. ఇక వన్డే ఫార్మాట్ విషయానికి వస్తే.. రోహిత్ 49-ప్లస్ సగటుతో 10,000పైగా పరుగులు చేసాడు. వన్డేల్లో రోహిత్‌కు 55 అర్ధసెంచరీలు చేసాడు. వన్డేల్లో రోహిత్‌కు 31 సెంచరీలు ఉన్నాయి. వన్డేల్లో మూడు డబుల్ సెంచరీలు సాధించిన ఏకైక ఆటగాడు రోహిత్. టీ20 క్రికెట్‌లో రోహిత్‌కు 29అర్ధ సెంచరీలు ఉన్నాయి. 148 మ్యాచ్‌లలో 31.32 సగటుతో 3,853 పరుగులు చేసాడు. ఈ ఫార్మాట్‌లో అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా రోహిత్ నిలిచాడు. టీ20ల్లో కోహ్లీ (4,008) మాత్రమే అతనికంటే ముందున్నాడు.