Anant ambani: అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్.. దాండియా ఆడిన ధోని- బ్రావో
Anant ambani pre wedding: దేశంలోనే అత్యంత సంపన్నుడు ముకేష్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకలు జామ్‌నగర్‌లో అట్టహాసంగా కొనసాగుతున్నాయి. అనంత్ అంబానీ, రాధిక మర్చంట్‌ల ప్రీ వెడ్డింగ్ వేడుకకు దేశం నుంచే కాకుండా ప్రపంచం నలుమూలల నుంచి ప్రముఖులు హాజరయ్యారు. అయితే ఈ ఈవెంట్‌లో భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ కూడా భాగమయ్యాడు. వెస్టిండీస్ లెజెండ్ డ్వేన్ బ్రావో ఈ వేడుకల్లో పాల్గొన్నాడు. వీరద్దరూ కలిసి దాండియా ఆడటం హైలెట్‌గా నిలిచింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వీరిద్దరూ దాండియా ఆడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అలాగే, మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్‌తో కూడా ఎంఎస్ ధోని కాసేపు ఈ ఈవెంట్‌లో సందడి చేశాడు.