Page Loader
Dharamsala test: నాలుగో టెస్టులో ఇంగ్లండ్‌పై టీమిండియా ఘన విజయం.. 4-1తో సిరీస్ కైవసం 
Dharamsala test: నాలుగో టెస్టులో ఇంగ్లండ్‌పై టీమిండియా ఘన విజయం.. 4-1తో సిరీస్ కైవసం

Dharamsala test: నాలుగో టెస్టులో ఇంగ్లండ్‌పై టీమిండియా ఘన విజయం.. 4-1తో సిరీస్ కైవసం 

వ్రాసిన వారు Stalin
Mar 09, 2024
02:21 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇంగ్లండ్‌తో ధర్మశాలలో జరిగిన నాలుగో టెస్టులో టీమిండియా విజయఢంకా మోగించింది. ఇన్నింగ్స్ 64పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో రోహిత్ శర్మ సారథ్యంలో టీమిండియా 4-1తో సిరీస్‌ని కైవసం చేసుకుంది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ కేవలం 218 పరుగులకు ఆలౌటైంది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా భారత్ రోహిత్ శర్మ (103), శుభ్‌మన్ గిల్ (110) సెంచరీలు, యశస్వి జైస్వాల్ (57), దేవదత్ పడిక్కల్ (65), సర్ఫరాజ్ ఖాన్ (56) అర్ధ సెంచరీలతో 477 పరుగులకు ఆలౌటైంది. టీమిండియా 259 పరుగుల అధిక్యంలో ఉండగా.. ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్‌ను ప్రారంభించింది. రెండో ఇన్నింగ్స్‌లో రవిచంద్రన్ అశ్విన్ స్పిన్ స్పిన్ మాయాజానికి కుప్పకూలింది. 195 పరుగులకే ఆలౌట్ అయ్యింది.

రోహిత్

రోహిత్ టెస్టు కెరీర్‌లో 12వ సెంచరీ

మ్యాచ్ తొలి రోజు చివరి సెషన్‌లో రోహిత్ అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. అతను స్టంప్స్ వరకు 52 పరుగులతో నాటౌట్‌గా ఉన్నాడు. రెండో రోజు తొలి సెషన్‌లో రోహిత్ తన ఇన్నింగ్స్‌ను సెంచరీగా మలిచాడు. జైస్వాల్‌తో కలిసి తొలి వికెట్‌కు 104పరుగులు, గిల్‌తో కలిసి రెండో వికెట్‌కు 171పరుగులు జోడించారు. ఇన్నింగ్స్‌లో 162బంతుల్లో 103 పరుగులు చేసిన తర్వాత అతను బెన్ స్టోక్స్‌ వేసిన బంతికి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఈ సెంచరీ ద్వారా ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్‌గా రోహిత్ తన 43వ అంతర్జాతీయ సెంచరీని నమోదు చేశాడు. అత్యధిక సెంచరీలు బాదిన మూడో బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. ఈ విషయంలో రోహిత్ కంటే ముందు డేవిడ్ వార్నర్(49), సచిన్ టెండూల్కర్(43) మాత్రమే ముందున్నారు.