Page Loader
ICC Rankings : ఐసీసీ ర్యాంకింగ్స్‌లో భారత ప్లేయర్స్ సత్తా.. అగ్రస్థానంలో గిల్, సిరాజ్
ఐసీసీ ర్యాంకింగ్స్‌లో భారత ప్లేయర్స్ సత్తా.. అగ్రస్థానంలో గిల్, సిరాజ్

ICC Rankings : ఐసీసీ ర్యాంకింగ్స్‌లో భారత ప్లేయర్స్ సత్తా.. అగ్రస్థానంలో గిల్, సిరాజ్

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 08, 2023
05:24 pm

ఈ వార్తాకథనం ఏంటి

వన్డే వరల్డ్ కప్ 2023లో వరుస విజయాలతో దూసుకెళ్తున్న భారత జట్టు ఐసీసీ(ICC) ర్యాంకింగ్స్‌లోనూ సత్తా చాటింది. ప్రపంచ వన్డే నెంబర్ వన్ జట్టుగా టీమిండియా అవతరించింది. మరోవైపు బ్యాటింగ్, బౌలింగ్ విభాగంలో భారత్ ఆటగాళ్లు అగ్రస్థానంలో నిలిచారు. బుధవారం వన్డే ర్యాంకింగ్స్ జాబితాను ఐసీసీ విడుదల చేసింది. ఈ జాబితాలో భారత స్టార్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ నెంబర్ వన్ బ్యాటర్ గా నిలిచాడు. ఈ క్రమంలో పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్‌ను అతను వెనక్కి నెట్టాడు. సచిన్ టెండూల్కర్, ఎంఎస్ ధోని, విరాట్ కోహ్లీ తర్వాత భారత తరుపున ప్రపంచ నెం.1 బ్యాటర్‌గా నిలిచిన నాలుగో ప్లేయర్‌గా గిల్ ఆ ఘనత సాధించాడు.

Details

సచిన్ రికార్డును బద్దలు కొట్టిన గిల్

ఇక విరాట్ కోహ్లీ నాలుగో స్థానానికి చేరుకోగా, టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఆరో స్థానంలో నిలిచాడు. మరోవైపు ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో ప్రపంచ నెం. 1 ర్యాంక్ సాధించిన భారత్‌కు చెందిన అత్యంత పిన్న వయస్కుడిగా సచిన్ టెండూల్కర్ రికార్డును గిల్ బద్దలు కొట్టడం విశేషం. బౌలింగ్ జాబితాలో టీమిండియా పాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ అగ్రస్థానానికి చేరుకున్నాడు. ఈ విభాగంలో నాలుగో స్థానంలో కుల్దీప్ యాదవ్, 10వ స్థానంలో మహ్మద్ షమీ ఉన్నాడు. ఆల్ రౌండర్ విభాగంలో బంగ్లాదేశ్ ప్లేయర్ షకీబ్ అల్ హసన్ మొదటిస్థానంలో నిలిచాడు. ఈ విభాగంలో భారత ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా 10వ స్థానంలో ఉన్నాడు.