Page Loader
IND Practice Match: విఫలమైన విరాట్ కోహ్లీ.. విజృంభించిన రోహిత్
రెండు పరుగులకే వెనుతిరిగిన కోహ్లీ

IND Practice Match: విఫలమైన విరాట్ కోహ్లీ.. విజృంభించిన రోహిత్

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 06, 2023
02:58 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రస్తుతం టీమిండియా జట్టు కరీబియన్ దీవుల్లో ఉన్న సంగతి తెలిసిందే. జూలై 12 నుంచి వెస్టిండీస్‌తో మొదలు కానన్న టెస్టు సిరీస్ కు భారత జట్టు సిద్ధమైంది. ఇప్పటికే కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సహా టెస్టులకు ఎంపికైన జట్టు మొత్తం విండీస్‌లో అడుగుపెట్టింది. మంగళవారం వరకు నెట్స్ కి పరిమితమైన టీమిండియా,బుధవారం నుంచి గ్రౌండ్ ప్రాక్టీస్ మొదలు పెట్టింది. 17 మంది సభ్యులతో కూడిన జట్టు రెండుగా విడిపోయి ప్రాక్టీస్ మ్యాచ్ ఆడుతోంది. బ్యాటర్లు, బౌలర్లు వేర్వేరు టీమ్‌గా ప్రాక్టీస్ చేశారు. ఈ ప్రాక్టీసు మ్యాచులో విరాట్ కేవలం రెండు పరుగులకే వెనుతిరిగాడు. లెఫ్టార్మ్ పేసర్ జయదేవ్ ఉనాద్కత్ బౌలింగ్‌లో స్లిప్‌లో క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు.

Details

హాఫ్ సెంచరీలతో రాణించిన రోహిత్ శర్మ, యశస్వీ జైస్వాల్

ప్రస్తుతం విరాట్ కోహ్లీ ఔటైన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కోహ్లీ ఇంత ఈజీగా ఔట్ అయ్యాడా అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. మరోవైపు ఈ ప్రాక్టీస్ మ్యాచులో కెప్టెన్ రోహిత్ శర్మ, యువ ప్లేయర్ యశస్వీ జైస్వాల్ ఓపెనర్లుగా వచ్చారు. మంచి ఫామ్‌లో కనిపించిన ఈ ఇద్దరూ తొలి సెషన్ మొత్తం ఆడారు. ఇద్దరూ హాఫ్ సెంచరీలు సాధించి రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగారు. కోహ్లీ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన రహానే కూడా ఎక్కువ సేపు క్రీజులో ఉండలేకపోయాడు. జయదేవ్ ఉనాద్కత్ బౌలింగ్‌లో అతను వెనుతిరిగాడు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

స్లిప్ లో క్యాచ్ ఇచ్చి వెనుతిరిగిన విరాట్ కోహ్లీ