రెండో టెస్టుపై కన్నేసిన టీమిండియా
ఈ వార్తాకథనం ఏంటి
నాగపూర్ జరిగిన మొదటి టెస్టులో విజయం సాధించిన టీమిండియా.. రెండో టెస్టులో ఆస్ట్రేలియాతో తలపడేందుకు భారత్ సిద్ధమైంది. అయితే టెస్టు సిరీస్ ఎలాగైనా గెలవాలని ఆస్ట్రేలియా భావిస్తోంది. మొదటి టెస్టులో 132 పరుగుల తేడాతో గెలిచిన టీమిండియా ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగనుంది. టీమిండియాపై గెలిచి ప్రతీకారం తీర్చుకోవాలని ఆస్ట్రేలియా చూస్తోంది.
ఢిల్లీ లోని ఆరుణ్ జైట్లీ స్టేడియం స్పిన్‌కు అనుకూలంగా ఉండనుంది. ఇక్కడ 36 టెస్టులు జరగ్గా.. మొదట బ్యాటింగ్ చేసిన జట్లు కేవల ఆరుసార్లు మాత్రమే గెలిచాయి. ఈ వేదికపై భారత్ ఇప్పటి వరకు ఒక్క టెస్టు కూడా ఓడిపోకపోవడం గమనార్హం. మ్యాచ్ స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ ఉదయం9:30 గంటలకు ప్రత్యక్ష ప్రసారం కానుంది.
టీమిండియా
ఇరు జట్లలోని సభ్యులు
భారత్, ఆస్ట్రేలియా జట్లు ఇప్పటి వరకు మొత్తం 103 టెస్టుల్లో తలపడ్డాయి. ఇందులో ఆసీస్ 42 మ్యాచ్ లు గెలిచి అధిపత్యం ప్రదర్శిస్తోంది. భారత్ కేవలం 31 మ్యాచ్‌ల్లో మాత్రమే గెలుపొందింది. ఇంకా 28 మ్యాచ్‌లు డ్రా అయ్యాయి. స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగిన 51 టెస్టుల్లో భారత్ 22 విజయాలు, 13 ఓటములను చవిచూసింది.
వెన్ను గాయం నుంచి అయ్యర్ కోలుకోవడంతో రెండో టెస్టుకి సూర్యకుమార్ దూరమయ్యే అవకాశం ఉంది.
భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), రాహుల్, పుజారా, కోహ్లీ, అయ్యర్, భరత్ (వికెట్ కీపర్), జడేజా, అశ్విన్, సిరాజ్, షమీ, యాదవ్
ఆస్ట్రేలియా:ఖవాజా, వార్నర్, లాబుషాగ్నే, స్మిత్, అలెక్స్‌కారీ (వికెట్ కీపర్), ట్రావిస్‌హెడ్, హ్యాండ్‌కాంబ్, నాథన్‌లియోన్, కమిన్స్ (కెప్టెన్), స్టార్క్, టాడ్‌మర్ఫీ