IND vs AUS రెండో వన్డే: శ్రేయాస్ అయ్యర్, శార్దూల్ ఠాకూర్ రాణించకపోతే కష్టమే
భారత క్రికెట్ జట్టు ప్రస్తుతం ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ ఆడుతోంది. మొహాలి వేదికగా మొదటి వన్డేలో అద్భుతమైన విజయాన్ని భారత్ సొంతం చేసుకుంది. ఇండోర్‌లో ఆదివారం జరిగే రెండవ వన్డే కూడా గెలుచుకుని సిరీస్ కైవసం చేసుకోవాలని టీమిండియా భావిస్తోంది. ఆసీస్ పై మొదటి వన్డేలో తాత్కాలిక కెప్టెన్ కేఎల్ రాహుల్ అర్ద శతకంతో అద్భుతంగా రాణించాడు. దాదాపుగా ఆటగాళ్లందరూ అత్యద్భుతమైన ప్రదర్శనలు కనబరిచి ఇండియాకు విజయాన్ని అందించారు. అయితే ఇద్దరు ఆటగాళ్ల ఆటతీరు మాత్రం ఇబ్బందికరంగా ఉంది. బ్యాటర్ శ్రేయ శయ్యర్ ఆసీస్ తో జరిగిన మొదటి వన్డేలో పూర్తిగా విఫలమయ్యాడు. అటు బ్యాటింగ్ లో, ఇటు ఫీలింగ్ లోనూ శ్రేయాస్ అయ్యార్ సరైన ఆటతీరు కనబరచలేకపోయాడు.
బౌలింగ్ లో విఫలమైన శార్దూల్ ఠాకూర్
రెండవ వన్డేలో కూడా శ్రేయాస్ అయ్యర్ సరైన ఆటతీరుతో రాణించకపోతే ప్రపంచకప్ ఆడే ఛాన్స్ కోల్పోయే అవకాశం ఉందని అంటున్నారు. అంతేకాదు, ఆసీస్ తో జరిగే మూడో వన్డేలో కూడా శ్రేయాస్ అయ్యర్ స్థానంలో విరాట్ కోహ్లీ వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇక బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ మెరుగైన ఆట తీరును ప్రదర్శించాల్సి ఉంది. మొదటి వన్డేలో అందరికంటే ఎక్కువగా 78పరుగులు ఇచ్చాడు శార్దూల్ ఠాకూర్. రెండో వన్డేలో సరైన ప్రదర్శనతో ఆకట్టుకోకపోతే ఆసీస్ తో జరిగే మూడో వన్డేలో ఆడే ఛాన్స్ మిస్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు.