Page Loader
IND vs ENG test: రాంచీ టెస్టులో టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం 
IND vs ENG test: రాంచీ టెస్టులో టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం

IND vs ENG test: రాంచీ టెస్టులో టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం 

వ్రాసిన వారు Stalin
Feb 26, 2024
02:48 pm

ఈ వార్తాకథనం ఏంటి

రాంచీలో జరిగిన నాలుగో టెస్టులో ఇంగ్లండ్‌పై టీమిండియా ఘన విజయం సాధించింది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 3-1తో తిరుగులేని ఆధిక్యం సాధించి.. టైటిల్‌ను కైవసం చేసుకుంది. నాలుగో టెస్టులో ఐదు వికెట్ల తేడాతో రోహిత్ సేన గెలుపొందింది. దీంతో పురుషులు 2023-25 ఐసీసీ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) పాయింట్ల పట్టికలో టీమిండియా రెండో స్థానంలో నిలిచింది. రాజ్‌కోట్‌లో విజయంతో డబ్ల్యూటీసీ టేబుల్‌లో ఆస్ట్రేలియాను వెనక్కి టీమిండియా రెండో స్థానానికి ఎగబాకింది. ఇప్పుడు రెండోస్థానాన్ని మరింత పదిలం చేసుకుంది. డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో 75.0 శాతంతో న్యూజిలాండ్ రెండో స్థానంలో ఉంది. 64.58 పాయింట్ల శాతంతో టీమిండియా, 55.0 శాతంతో ఆస్ట్రేలియా మూడోస్థానంలో ఉన్నాయి.

టీమిండియా

ఐదు వికెట్ల తేడాతో విజయం

నాలుగో టెస్టులో టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్‌కు దిగింది. జో రూట్ అజేయంగా 122 పరుగులు చేయడంతో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 353 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో బెన్ ఫోక్స్ (47), ఆలీ రాబిన్సన్ (58) కూడా రాణించారు. ఆ తర్వాత తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా ధృవ్ జురెల్, కుల్దీప్ యాదవ్ రాణించండతో 307 పరుగులు చేసింది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌ బ్యాటింగ్‌కు వచ్చిన ఇంగ్లండ్‌ను 145 పరుగులకే టీమిండియా బౌలర్లు కట్టడి చేశారు. 192 పరుగుల టార్గెట్‌తో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా 5 వికెట్లు నష్టపోయి.. ఘన విజయం సాధించింది.

మీరు
50%
శాతం పూర్తి చేశారు

ట్విట్టర్ పోస్ట్ చేయండి

బీసీసీఐ ట్వీట్

మీరు పూర్తి చేశారు