Ind vs Pak: దంచికొట్టిన రోహిత్ శర్మ.. వరల్ కప్‌లో 8వ సారి పాకిస్థాన్‌పై టీమిండియా విజయం
ఈ వార్తాకథనం ఏంటి
హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ ఆటకు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం పులకించిపోయింది. ఐసీసీ ప్రపంచ కప్ 2023లో భాగంగా పాకిస్థాన్‌తో శనివారం జరిగిన మ్యాచ్‌లో దంచికొట్టాడు.
63బంతుల్లో 86 పరుగులు చేసి.. టీమిండియా గెలుపును చాలా సులువు చేశాడు.
రోహిత్ సేన 192 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగింది. 30.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని పూర్తి చేసింది.
గిల్‌తో ఇన్నింగ్స్ ప్రారంభించిన రోహిత్ మొదటి నుంచి దూకుడుగా ఆడాడు. గిల్ 16, కోహ్లి 16రన్స్, రోహిత్ 86 పరుగులు చేసి ఔట్ అయ్యారు.
హాఫ్ సెంచరీతో రాణించిన శ్రేయస్(53), కేల్ రాహుల్(19)తో కలిసి టీమిండియాను గెలిపించాడు.
వరల్డ్‌కప్ చరిత్రలో పాకిస్థాన్‌పై టీమిండియాకు ఇది 8వ విజయం. భారత్‌పై పాక్ ఇప్పటి వరకు ఒక్కటి గెలవలేదు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
7 వికెట్ల తేడాతో టీమిండియా గెలుపు
ICC World Cup | India beat Pakistan by 7 wickets at Narendra Modi Stadium in Ahmedabad.
— ANI (@ANI) October 14, 2023
(Rohit Sharma 86, Shreyas Iyer 53*)#INDvsPAK pic.twitter.com/l1EQ9kNhpm
టీమిండియా
191 పరుగులకే పాకిస్థాన్ ఆలౌట్
తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 191 పరుగులకే ఆలౌట్ అయ్యింది. టీమిండియా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పాకిస్థాన్‌ను 191 పరుగలకు కట్టడి చేశారు.
ఈ మ్యాచ్‌లో భారత బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ ఒక్కడే వికెట్లు తీసుకోలేదు.
మహ్మద్ సిరాజ్, బూమ్రా, హార్దిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా చెరో రెండు వికెట్లు తీశారు.
ఈ మ్యాచ్‍లో బుమ్రా మాత్రం మొదటి నుంచి తన ఆదిపత్యాన్ని చలాయించాడు.
ఏడు ఓవర్లు వేసిన అతను కేవలం 19 పరుగులు మాత్రమే ఇవ్వడం గమనార్హం. పాకి బ్యాటర్లలో బాబర్ అజామ్ మాత్రమే 50 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిచిచాడు.
టీమిండియా
వన్డేల్లో రోహిత్ శర్మ 300 సిక్సర్లు
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మరో మైలు రాయిని చేరుకున్నారు. వన్డే క్రికెట్‌లో 300 సిక్సర్లు బాదిన మూడో బ్యాటర్‌గా రోహిత్ రికార్డు సృష్టించారు.
తన 254వ వన్డేలో రోహిత్ 300 సిక్స్‌లను పూర్తి చేశాడు. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో పాకిస్థాన్‌తో శనివారం జరిగిన మ్యాచ్‌లో ఈ మైలురాయిని చేరుకున్నారు.
ఇటీవలే రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సిక్స్‌లు కొట్టిన ఆటగాడిగా నిలిచాడు.
వన్డేల్లో వెస్టిండీస్‌కు చెందిన క్రిస్ గేల్ (331 సిక్సులు), పాకిస్థాన్‌కు చెందిన షాహిద్ అఫ్రిది (351) రోహత్ కంటే ముందు ఉన్నారు.
అంతేకాకుండా భారత ఆటగాళ్ల విషయానికి వస్తే, సిక్సర్లలో రోహిత్ టాప్‌లో ఉండగా, ఎంఎస్ ధోని (229) రెండోస్థానంలో ఉన్నారు.