
IND vs WI : వెస్టిండీస్ తో ముగిసిన రెండో రోజు ఆట.. 286 పరుగుల ఆధిక్యంలో భారత్..
ఈ వార్తాకథనం ఏంటి
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ పట్టు బిగించింది. రెండో రోజు ఆట ముగిసిన సమయానికి భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు కోల్పోయి 448 పరుగుల వద్ద కొనసాగుతోంది. రవీంద్ర జడేజా 104 పరుగులు, వాషింగ్టన్ సుందర్ 9 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఈ సమయంలో భారత్ వెస్టిండీస్ పై 286 పరుగుల ఆధిక్యంలో ఉంది. వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 162 పరుగులకే ఆలౌటైంది.
వివరాలు
327 పరుగులు 3 వికెట్లు..
ఓవర్ నైట్ స్కోరు 121/2తో రెండో రోజు ఆటను ప్రారంభించిన భారత్ మరో 327 పరుగులు జోడించి మూడు వికెట్లు మాత్రమే కోల్పోయింది. మొదట బ్యాటింగ్ ప్రారంభించిన గిల్ (18), కేఎల్ రాహుల్ (53) వెస్టిండీస్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. లంచ్‌కు కొద్ది ముందు గిల్ (50) రోస్టన్ ఛేజ్ బౌలింగ్‌లో జస్టిన్ గ్రేవ్స్ చేతికి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. గిల్, రాహుల్ జంట మూడో వికెట్‌కు 98 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. తొలి రోజు హాఫ్ సెంచరీ సాధించిన కేఎల్ రాహుల్ రెండో రోజూ తనదైన శైలిలో పరుగులు రాబట్టాడు.
వివరాలు
ద్విశతక బాగస్వామ్యం..
లంచ్ విరామానికి కొన్ని నిమిషాల ముందు శతకాన్ని పూర్తి చేసుకున్నాడు.అయితే సొంత గడ్డపై రెండో శతకం కావడం విశేషం. అయితే లంచ్ తర్వాత తొలి ఓవర్‌లోనే రాహుల్ ఔట్ అయ్యాడు.గిల్,రాహుల్ ఔటైన అనంతరం వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్,రవీంద్ర జడేజా విండీస్ బౌలర్లపై అటాక్ చేశారు. ఈఇద్దరూ పోటాపోటీగా పరుగులు సాధించారు. ముందుగా ధ్రువ్ జురెల్ శతకం సాధించాడు(125). ఆతరువాత ధ్రువ్ జురెల్ ఖరీ పియర్ బౌలింగ్‌లో షై హోప్ చేత క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. జడేజా,జురెల్ జంట ఐదో వికెట్‌కు 206పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. జురెల్ ఔటైన కాసేపటికి జడేజా తన ఆరవ శతకం పూర్తి చేసి,వాషింగ్టన్ సుందర్‌తో కలిసి మరో వికెట్ కోల్పోకుండా రెండో రోజు ఆటను ముగించారు.